రాష్ట్రవ్యాప్తం గా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇప్పటి వరకు వెలువడిన ఐదవ రౌండ్‌లో బీజేపీ లీడ్ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈ ఐదవ రౌండ్‌లో 344 ఓట్ల మెజారీటిని సాధించి మొత్తం మీద 2169 ఓట్ల మెజారీటీలో ఉన్నారు. ఐదవ రౌండ్‌లో ఈటలకు 4358 ,టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ 4014 ఓట్లు సాధించారు. నాలగవ రౌండ్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యతను కనబరిచింది. ఈ క్రమంలోనే బీజేపీ నాలుగు రౌండ్ల ముగిసే సరికి 2542 ఓట్ల మెజారిటితో .. ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు.. కాగా మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రెండవ రౌండవ రౌండ్‌లో ఆధిక్యతను నిలుపుకున్నారు... మొదటి రౌండ్‌లో బీజేపి ఆధిక్యత కనబరిచింది. మొదటి రౌండ్‌లో 9894 ఓట్లను లెక్కించారు. ఇందులో 4610 ఈటల రాజేందర్ ,4444 గెల్లు శ్రీనివాస్ సాధించారు.. కాంగ్రేస్ పార్టీకి 119 ఓట్లు సాధించాయి.. కాగా స్వల్ప ఓట్ల మెజారిటితో బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. ..ఇక రెండవ రౌండ్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.. దీంతో ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి కంటే 359 ఓట్ల ఆధీక్యంలో కొనసాగుతున్నారు.. కాగా రెండవ రౌండ్‌లో మొత్తం 10427 ఓట్లను లెక్కించగా 4851 ఈటల సాధించగా.. 4659 ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సాధించారు. ఇక కాంగ్రేస్ పార్టీ మొత్తం రెండు రౌండ్లకు గాను 339 ఓట్లను సాధించింది. ఇక మూడవ రౌండ్ లో కూడ బీజేపీ తన ఆధిక్యతను కనబరుస్తోంది. ఈ క్రమంలోనే మూడవ రౌండ్ ఫలితాల వచ్చే సరికి ఈటల రాజేందర్ 1259 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు..
కాగా ఇందులో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంతో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారన్న ఉత్కంఠ కేవలం కరీంనగర్ జిల్లాకే కాకుండా తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్లోనూ ఎడతెగని ఆసక్తి నెలకొం ది .
ఇది చదవండి : ప్రారంభమైన పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో టీఆర్ఎస్
తొలుత పోస్టల్ బ్యాలెట్లు .. ఉదయం 6 గంటలకు సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కింపు పూర్తయింది. కాగా పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో 503 టీఆర్ఎస్, 159 బీజేపీ, 32 కాంగ్రేస్ పార్టీ కైవసం చేసుకున్నాయి. కాగా మొత్తం 22 రౌండ్ల లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది . ప్రతీ రౌండుకు కనీసం 30 నిమిషాల్లో పూర్తి కానుంది. .ఇక గతంలో లేని విధం గా రికార్డు స్థాయిలో ఓటింగ్ 86.64 శాతం ( 2,05,236 ఓట్లు ) నమోదవడంతో ఈ సమయం కనీసం 45 నిమిషాలు పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది . తొలిఫలితం హుజూరాబాద్ రూరల్ మండలం పోతిరెడ్డిపేట్ పోలింగ్ స్టేషన్ తో మొదలైంది . తుది ఫలితం కమలాపూర్ మండలం శం భునిపల్లితో ముగియనుంది . మధ్యలో వీణవంక , జమ్మికుంట , ఇల్లందకుంట మండలాల ఫలితాలు వస్తాయి .
కాగా ఎన్నికల ఫలితాల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి.. అయితే మెజారిటి ఫలితాలు వెలువరించిన సంస్థలు బీజేపీ కి మెజారిటి ఇచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తోందని భావించిన టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు అవుతోంది . ఈ క్రమంలో సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దళిత బంధు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ వెనకంజలో ఉన్నట్టు ఫలితాలు వెలువడ్డాయి. దళిత బంధు కోసం సుమారు 2000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే..
ఇక కౌంటింగ్ జరిగే ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణం వద్ద మూడంచెల భద్రత కల్పించారు . కరీంనగర్ పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన గొడవ లను దృష్టిలో ఉంచుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు . ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు కేంద్ర బలగాలు , సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నారు . కాలేజీ పరిసరాల్లో జనసంచారం నిరోధానికి 144 సెక్షన్ విధించారు . ముం దు జాగ్రత్త చర్యగా కాలేజీ ముందున్న దాదాపు రెండు కిలోమీటర్ల రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు .
.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Huzurabad By-election 2021, Karimnagar, Telangana News