Home /News /telangana /

COTTON RESERCH CENTER IN ADILABAD DISTRICT TELANGANA GOVT DECIDES VRY

TS NEWS : అగ్రి డెవలప్‌మెంట్... ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రం, పంటలకు బ్రాండ్ ఇమేజ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS NEWS : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్న తెలంగాణ , ఆ రంగంలో మరింత పురోగభివృద్దిని సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పత్తిపంట పరిశోధన కేంద్రాన్ని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
    రైతుల అభివృద్ది, వ్వవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతులకు రైతు బంధు, రైతు భీమాతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుండడంతో పాటు నీళ్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పంటల ఉత్పత్తి పెడరగంతో అందుకు అనుగుణంగా పంటల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

    ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధన కేంద్రం

    ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయ ప్రగతి, రైతులకు మరింత చేరువ కావడం, వంటి అంశాలపై అధికారులతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.. ముఖ్యంగా పంటల మార్పిడి.. వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో పరిశోధనలు జరగాలని సూచించారు. ఇక అంతర్జాతీ యంగా తెలంగాణ పత్తికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌లో పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు.. మరోవైపు తాండూరులో కంది విత్తన పరిశోధనాకేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచాలని నిర్ణయించామని చెప్పారు.ఇక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా క్రాప్ సోసైటీల అభివృద్ధికి ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, ఆలుగడ్డ, ఇతర కూరగాయల సాగుకున్న అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.

    TS Politics : మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు.. ముచ్చింతల్‌కు సీఎం కావాలనే వెళ్లలేదు.. అయితే ఎంటీ...?

    నూతన  ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలు 

    ఖమ్మం జిల్లా వేంసూరులో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీగా మార్చనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో 60 ఎకరాల్లో, మహబూబాబాద్‌లో 84 ఎకరాల్లో ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ ద్వారా మరో రెండు ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.రాబోయే ఆరు నెలల్లో ఈ నాలుగు ఫ్యాక్టరీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

    Kamareddy: మూడేళ్ల పాపను చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లిన వృద్దుడు.. బట్టలు విప్పి..!

    పంటలకు బ్రాండ్ ఇమేజ్..

    తెలంగాణ సోనా వరి, మహబూబాబాద్, ఖమ్మం మిరప, తాండూరు కంది, పాలమూరు వేరుశనగ, నిజామాబాద్‌ పసుపు, తెలంగాణ పత్తి, జగిత్యాల, కొల్లాపూర్‌ మామిడి వంటి ఉత్పత్తులకు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించాలన్నారు. ఇక ఆలుగడ్డ విత్తన సమస్యను అధిగమించడానికి విత్తన నిల్వకు కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు