హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అధికారుల బంధువులకే .. భర్తీ పేరుతో భారీ స్కాం

Telangana : ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు అధికారుల బంధువులకే .. భర్తీ పేరుతో భారీ స్కాం

mahabubnagar Corruption

mahabubnagar Corruption

Telangana : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కార్యలయంలో పని చేసే పైస్థాయి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో నియమించడం పెద్ద దుమారం రేపుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India

  (Syed Rafi,News18,Mahabubnagar)తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల్లో నిబంధనకు విరుద్ధంగా పొరుగు సేవ నియామకాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఈ తరహా బాగోతం బయటడగా..ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇదే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గతంలో గురుకుల పాఠశాలల(Gurukula Schools) కేజీబీవీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు( KGBV Minority Welfare)సబ్ రిజిస్టర్(Sub Register),ఆర్డీవో(RDO),విద్యుత్ శాఖలు(Electricity Departments)పొరుగు సేవల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. తాజాగా మహబూబ్‌నగర్‌(Mahabubnagar)జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో పోరుగు సేవల పేరుతో అక్రమంగా నియామకాలు చేశారు.

  Telangana : సెంట్రల్ విస్టాలో ఖమ్మం బ్లాక్ గ్రానైట్ .. భారీ విగ్రహంతో భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు  ఇష్టారాజ్యంగా ఉద్యోగ నియామకాలు..
  మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే తమకు అనుయాయులైన వారికి ప్రభుత్వ శాఖల్లోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో ఫార్మసిస్టుల నియామకాలు నిబంధనల తిలోదకాలిచ్చారు కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సీనియర్ సహాయకులు. తమ కుటుంబ సభ్యులకు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఒక సీనియర్ సహాయకుడు ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందికి సంబంధించిన మరొకరు 104 సేవలతో పాటు ఇతర సిబ్బంది పరిపాలన వ్యవహారాలను చూస్తున్నారు. ఆ ఇద్దరు వారి కుటుంబ సభ్యులకు ఫార్మసిస్టులుగా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


  సొంత వాళ్లకే కొలువులు..
  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు కలిపి 23 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 మంది ఫార్మసిస్టు 25 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. రెండు విభాగాల్లో కలిపి 50 మంది పనిచేస్తున్నారు. వీరిలో 23 మందిని ఒప్పంద పొరుగు సేవలు కింద తీసుకున్నారు. అందులో నలుగురు 104 సర్వీస్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చారు. మిగతా 19 మందిలో కొందరి నియామకాలు అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. అలాగే దస్త్రాల్లో బాలనగర్‌లో ఫార్మసిస్ట్ గా ఒక వ్యక్తి పేరు ఉండగా ...ప్రస్తుతం ఆయన అక్కడ విధుల్లోనే లేరు. జడ్చర్ల విధుల్లో నిర్వహించాల్సిన మరొకరు అధికారులను కాదని మహబూబ్‌నగర్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వైద్య సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో పట్టుబట్టి పోస్టింగులు ఇప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ అక్కడ ఇది వరకే ఫార్మసిస్టులు ఉన్న మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదం అవతుంది.

  Hyderabad : మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ .. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్ ఎందుకంటే..?  వాళ్ల మౌనానికి కారణం ..?
  మే నెలలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యుల నియామకాల్లో జిల్లా అధికారులు మౌనంగా ఉండడం వెనుక విమర్శలు వెలుగుతున్నాయి. ఆ సిబ్బంది జిల్లా అధికారులను సూచించే స్థాయిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే కొన్ని పోస్టులు నిబంధనలను తుంగలో తొక్కి వారి కుటుంబ సభ్యులను నియమించుకున్న అధికారులు మౌనంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికారుల జాతకాలు సిబ్బంది వద్ద ఉండడంతో వారు ఏం చేసిన పట్టించుకోవడంలేదని అంటున్నారు అధికారులు వివరాలు అడిగిన సిబ్బంది ఇచ్చే పరిస్థితులు లేదంటే కార్యాలయంలో పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
  ఆఫీసర్లంతా అంతా గప్‌ చుప్‌..
  ఔట్‌ సోర్సింగ్‌ సేవల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకున్న వారి వివరాలు అడుగుతుంటే సమాధానం దాటేశారు. కనీస ప్రాథమిక సమాచారం ఇవ్వడానికి వెనుకడుగు వేయడం అక్రమాలు జరిగాయడానికి బలం చేరుకోరుస్తుంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చామని జిల్లా వైద్య అధికారుల శాఖ కార్యాలయం పరిపాలన అధికారి సమాధానం ఇచ్చారు. ఏ దినపత్రికలో నోటిఫికేషన్ ఇచ్చారు..? ఉత్తమ అభ్యర్థులు మెరిట్ జాబితా ఏది ..? అనే ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం లేకుండా ఉండడం చూస్తుంటే అందరికి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఉద్యోగ నియామకాల పేరుతో జరిగిన అవకతవకలపై ప్రశ్నించే వాళ్లెవరని ప్రశ్నిస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Corruption, Mahabubnagar, Telangana News

  ఉత్తమ కథలు