• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CORRUPTION ALLEGATIONS ON MAHADEVPUR GIRIJANA CO OPERATIVE CORPORATION MANAGER MS

మహదేవ్పూర్ జీసీసీలో అవినీతి బాగోతం.. డెలివరి బాయ్స్ కు రావాల్సిన డబ్బులనూ దోచుకుంటున్న మేనేజర్..

మహదేవ్పూర్ జీసీసీలో అవినీతి బాగోతం.. డెలివరి బాయ్స్ కు రావాల్సిన డబ్బులనూ దోచుకుంటున్న మేనేజర్..

ప్రతీకాత్మక చిత్రం

గ్యాస్ డెలివరి బాయ్స్ సిలిండర్లను వినియోగదారులకు చేరవేస్తే ప్రభుత్వం నుండి రూ. 5 అందాల్సి ఉంది. కానీ అది కూడా మేనేజర్ చేతికే వెళుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను ఆఫీస్ లో కూర్చుని కడుపులో సల్ల కదలకుండా ఉంటే.. కష్టపడ్డ  డెలివరి బాయ్స్ కు మాత్రం మొండి చేయి చూపిస్తున్నాడని ఆరోపణలున్నాయి.

  • Last Updated:
  • Share this:
    మహాదేవపూర మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ (GCC) లో పెద్ద ఎత్తున అవినీతి నీడలు కనిపిస్తున్నాయి. మండలంలోని గిరిజన కార్యక్రమంలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న హారిలాల్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్  నుండి మొదలు.. రైస్ గోదాం దాకా కమిషన్ దందా లో ఆయన హస్తముందని విమర్శలు  వస్తున్నాయి.  గ్యాస్ డెలివరి బాయ్స్ గ్యాస్ ను వినియోగదారులకు చేరవేస్తే ప్రభుత్వం నుండి రూ. 5   సిబ్బందికి అందాల్సి ఉంది. కానీ అది కూడా మేనేజర్ చేతికే వెళుతున్నదని  ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను ఆఫీస్ లో కూర్చుని కడుపులో సల్ల కదలకుండా.. కష్టపడ్డ  డెలివరి బాయ్స్ కి మాత్రం  మొండి చేయి చూపిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ప్రతి నెలా  సుమారుగా మహాదేవపూర్ మండల కేంద్రంలో ని వివిద గ్రామాలకు  7 ఆటోలలో డెలివరి  బాయ్స్ సుమారు ఐదు వేల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. అయితే వీటిని సరఫరా చేసే సమయంలో డెలివరి బాయ్స్ కు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు రూపాయలు కూాడా  మేనేజరే నొక్కేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం ఏడుగురు డెలివరి బాయ్స్ దగ్గర..  సిలిండర్  ఒక్కంటికి రూ. 10 చొప్పున.. ప్రతి నెలా ఒక్కో గ్యాస్  సిలెండర్ పదిహేను రూపాయలు మెనేజర్  చేతివాటం కిందే పోతుంది. సదరు అధికారి గత 8 సంవత్సరాలుగా ఇలానే చేస్తూ లక్షల్లో వెనుకేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.

    అడిగితే బెదిరిస్తున్నాడు...

    ఇప్పటి వరకు గ్యాస్ తరలించే డెలివరి బాయ్స్ కి న్యాయంగా రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా తనే స్వాహా చేస్తున్నాడని.. సిబ్బందికి మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని.. వారికి ఆ సొమ్ము ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగా వారిని భయపెట్టి ఒప్పిస్తున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఆయన మాటకు డెలివరి బాయ్స్ ఎదురుచెబితే.. వారి ఆటోని తొలగించి వేరే ఆటో పెట్టుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ భయానికి పాపం  డెలివరి బాయ్స్ ఏమీ చెయ్యని దుస్థితికి చేరారు.  దీంతో చేసేదేంలేక... గత 8 సంవత్సరాల నుండి బాధలు పడుతున్నారు.

    పట్టించుకోని అధికారులు...

    మహాదేవపూర్ లో ఇలాంటి అవినీతికి  పాల్పడుతున్న మేనేజర్ పై  ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.  చెక్కు రూపంలో వచ్చే రూ. 5 మరియు డిలివరి బాయ్స్ దగ్గర రూ. 10 రూపాయలు.. ఈ సొమ్ము ను తన ఖాతాలో వేస్కుంటున్న మేనేజర్ పై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని మండలంలోని  పలు దళిత గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కూడా మేనేజర్ పై మహాముత్తరం  వడ్ల కొనుగులుపై పెద్ద మొత్తంలో లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం ఉన్నతాధికారులు  దృష్టికి వెళ్లినా వాళ్లను మ్యానేజ్ చేశారని పలువురు వాపోతున్నారు.

    తనకు నచ్చిన సిబ్బందినే ఆఫీసులో పెట్టుకుని...

    కార్యాలయంలో తనకు నచ్చిన వారిని దగ్గర పెట్టుకొని ఇష్టారాజ్యంగా చలామణి చేయడం పై కార్యాలయ సిబ్బందిలోనూ అసహనం వ్యక్తం అవుతున్నది. ఈ అవినీతి అధికారిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మేనేజర్ హారిలాల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పియస్ నాయకులు, పలువురు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

    - (Article Courtesy: Surya Daily)
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు