Corona Vaccine dry run: నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరగబోతోంది. ఇప్పటికే డ్రై రన్ జరిపిన రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో దీన్ని నిర్వహించబోతున్నారు. తెలంగాణలో 6 చోట్ల ఇది జరగబోతోంది. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం... 11 గంటలలోగా ముగుస్తుంది. ఇందులో కరోనా వ్యాక్సిన్ లాంటి డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. తద్వారా నిజమైన వ్యాక్సిన్ వచ్చినప్పుడు... ఎలా ఇవ్వాలో ట్రయల్ రన్ ఇవాళ వేసుకుంటారు. ఇందులో భాగంగా GHMC పరిధిలో తిలక్‌నగర్ UPHC, నాంపల్లి ఏరియా హాస్పిటల్, సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి, మహబూబ్‌నగర్ జిల్లాలోని జానంపేట PHC, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, నేహా షైన్ హాస్పిటల్ లను డ్రై రన్ కోసం ఎంచుకున్నారు. ఈ హాస్పిటల్స్‌లో ప్రత్యేక డ్రై రన్ కేంద్రాలు ఉంటాయి. ఒక్కో కేంద్రంలో 25 మంది వాలంటీర్లకు డ్రై రన్ వ్యాక్సిన్ (డూప్లికేట్ వ్యాక్సిన్) ఇస్తారు. ఇలా మొత్తం 150 మందికి ఇస్తారు. ఆల్రెడీ ఇందులో పాల్గొనే వారి పేర్లు నిన్నే కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు.
ఇలా జరుగుతుంది:
ఉదయం 8 గంటలకు డమ్మీ వ్యాక్సిన్‌ను... స్టోరేజ్ కేంద్రాల నుంచి... డ్రై రన్ కేంద్రాలకు తరలిస్తారు. ఒక్కో కేంద్రానికీ అవసరమైన వాటి కంటే మరో 15 శాతం ఎక్కువ డోసులు పంపిస్తారు. అవి రాగానే డాక్టర్లు అవి సరిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. తర్వాత కేంద్రాల్లో ఉంచిన ఫ్రీజర్లలో వాటిని ఉంచుతారు. వ్యాక్సిన్ వేసే 5 నిమిషాల ముందు వాటిని బయటకు తీస్తారు.
ఎవరికి వ్యాక్సిన్, ఏ టైంలో వేస్తున్నదీ వారి వారి మొబైల్స్‌కి మెసేజ్ వెళ్తుంది. ఆ టైముకి వారు వచ్చి కేంద్రంలో రెడీగా ఉండాలి. అక్కడి పోలీసులకు తమ ఐడీ కార్డు చూపించాలి. లేదా తమకు వచ్చిన మెసేజ్ చూపించాలి. వారిని పోలీసులు చెక్ చేసి... కేంద్రం లోపలికి అనుమతిస్తారు. ఇలా వన్ బై వన్ అందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు... పక్క గదిలో ఓ అరగంటపాటూ ఉండాలి. ఆ సమయంలో వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే... ఆస్పత్రికి తరలిస్తారు. రాకపోతే... ఇంటికి పంపిస్తారు. ఇవాళ్టి డ్రై రన్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవే రావు. కానీ... ఒరిజినల్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో, అలాగే ఇవాళా ట్రయల్ రన్ చేస్తారు.
డ్రై రన్లో పాల్గొన్న వారికి నెక్ట్స్ రెండో డోస్ ఎప్పుడు ఇచ్చేదీ మొబైల్ మెసేజ్ పంపిస్తారు. ఇది కూడా నిజమైనది కాదు. ట్రయల్‌లో భాగమే. అందువల్ల వారికి నిజంగా రెండో డోస్ అనేది ఇవ్వరు.
ఇది కూడా చదవండి:Horoscope Today: జనవరి 2 రాశి ఫలాలు... ఈ రాశుల వారు నేడు షాపింగ్ చేస్తారు
కేంద్ర ఆరోగ్య నిపుణుల కమిటీ... సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ కోవిషీల్డ్ (covishield)కి జై కొట్టింది. కేంద్రం కూడా దానికి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల తెలంగాణకు తొలి విడతగా... 10 లక్షల డోసులు వస్తాయని అంచనా. వాటిని రాష్ట్రంలోని 2,67,246 మంది ఆరోగ్య సిబ్బంది, 2 లశ్రల మందికి పైగా ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇస్తారని తెలిసింది.