షాద్‌నగర్‌లో కరోనా కలకలం.. వణికిపోతున్న జనం

ఈశ్వర్ కాలనీకి చెందిన యువకుడు ఫైనాన్స్ కలెక్షన్ కోసం మెయిన్ రోడ్డులో దాదాపు చాలా దుకాణాల్లో డబ్బులు కలక్షన్ చేసినట్లు సమాచారం. దీంతో మెయిన్ రోడ్డులోని దుకాణాలను పోలీసులు మూసివేయించారు.

news18-telugu
Updated: May 23, 2020, 6:33 PM IST
షాద్‌నగర్‌లో కరోనా కలకలం.. వణికిపోతున్న జనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కరోనా వైరస్ కలకలం స‌ృష్టిస్తోంది. దీంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని వినాయక గంజ్ నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో కళకళలాడే గంజ్ పాంత్రం ఇప్పుడు కంటైన్మెంట్ జోన్‌గా మారడంతో పరిస్థితి గంభీరంగా మారింది. మొత్తంగా షాద్ నగర్ పట్టణంలో మూడు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. వీటితో పాటు అదనంగా మెయిన్ రోడ్డుపై పోలీసులు దృష్టి సారించారు. తాజా పరిస్థితులను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి సమీక్షించారు. 14 రోజుల పాటు గంజ్, మెయిన్ రోడ్లలో వ్యాపార లావాదేవీలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా విజయనగర్ కాలనీకి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులను 20మంది దాకా క్వారంటైన్ చేశారు.

అదేవిధంగా సదరు వ్యక్తిని వైద్య పరీక్షలు చేసిన ప్రైవేట్ డాక్టర్, సిబ్బందిని కూడా క్వారంటైన్ చేశారు. తాజాగా ఈశ్వర్ కాలనీకి చెందిన ఓ యువకుడికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఈశ్వర్ కాలనీలో కూడా సదరు వ్యక్తి ఇంటికి 300 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సంబంధించి నివాసం ఉంటున్న విజయనగర్ కాలనీలో పోలీసు ఆంక్షలు మొదలయ్యాయి. అదేవిధంగా గంజ్ ప్రాంతాల్లో కూడా ఆంక్షలు పెట్టారు. వీటితో పాటు మెయిన్ రోడ్డులో షాపులన్నీ మూసివేశారు. పోలీసులు దగ్గరుండి హైఅలర్ట్ చేస్తున్నారు. అయితే ఈశ్వర్ కాలనీకి చెందిన యువకుడు ఫైనాన్స్ కలెక్షన్ కోసం మెయిన్ రోడ్డులో దాదాపు చాలా దుకాణాల్లో డబ్బులు కలక్షన్ చేసినట్లు సమాచారం. దీంతో మెయిన్ రోడ్డులోని దుకాణాలను పోలీసులు మూసివేయించారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading