గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో డాక్టర్లపై దాడి.. ఖండించిన మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం సైతం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. డాక్టర్లపై దాడిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిది.

news18-telugu
Updated: April 1, 2020, 9:54 PM IST
గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో డాక్టర్లపై దాడి.. ఖండించిన మంత్రులు
గాంధీ ఆస్పత్రి
  • Share this:
గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డులో డాక్టర్లపై దాడి జరిగింది. ఇవాళ సాయంత్రం ఓ కరోనా పేషెంట్ చనిపోవడంతో.. అదే వార్డులో చికిత్స పొందుతున్న అతడి సోదరుడు డాక్టర్లపై దాడి చేశాడు. ఈ ఘటన తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రాణాలను పణంగాపెట్టి కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తుంటే.. ఇలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. డాక్టర్లపై దాడిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిది. గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనను తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ ల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించం. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటి? డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారు.వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము.
ఈటల రాజేందర్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి


గాంధీ హాస్పిటల్ లో డాక్టర్‌ల పై దాడి అమానుష చర్య. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. 24 గంటలు డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిపై దాడి చేయడం బాధ్యతారాహిత్యం. వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.
తలసాని శ్రీనివాస్ యాదవ్, పశసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి


కరోనా పై పోరాటంలో అలుపెరుగకుండా వైఫ్య సేవలు అందిస్తున్న వారిపై దాడి చేయడం మూర్ఖపు చర్య. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడమే వైద్యులు చేసిన తప్పా..? పిపిఈ కిట్స్ లేకున్నా వైద్యం అందిస్తున్న డాక్టర్లు పై దాడులు చేయడం హేయమైన చర్య. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు , శానిటేషన్ సిబ్బందికి, పోలీసులు రక్షణ కల్పించాలి.
బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు




తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 7కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 97 కేసులు నమోదవగా.. 77 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి కరోనావైరస్ బులెటిన్ విడుదల కావాల్సి ఉంది.
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading