సీఎం కేసీఆర్ వీడియో వైరల్.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు

సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, జాతీయ ఛానెళ్ల జర్నలిస్టులు, సినీ తారలు సోనూసూద్, మంచు లక్ష్మి, ప్రియా ఆనంద్‌, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నెటిజన్లు కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు

news18-telugu
Updated: March 31, 2020, 2:45 PM IST
సీఎం కేసీఆర్ వీడియో వైరల్.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ సాధారణంగా మీడియాలో పెద్దగా కనిపించరు. ఎంత పెద్ద నిర్ణయమో తీసుకుంటే తప్ప ప్రెస్ మీట్‌కు దూరంగా ఉంటారు. అలాంటిది కరోనా వైరస్ నేపథ్యంలో వరసగా మీడియా ముందుకు వస్తున్నారు. ప్రతి రెండు మూడు రోజులకోసారి కరోనా వైరస్, లాక్‌డౌన్‌పై సమీక్ష నిర్వహించి.. అనంతరం ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఐతే శనివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ వీడియో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ అందరూ పాటించాలని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతూనే.. వలస కార్మికుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. వారికి సులభంగా అర్థమయ్యేలా హిందీలోనే ప్రసంగించారు.

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. మీరూ మా బిడ్డలేనని.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. మీకు ఎలాంటి కష్టం రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు సీఎం. రేషన్ కార్డు లేకున్నా ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు రూ. 500 ఇస్తామని స్పష్టం చేశారు. తమ వివరాలను దగ్గర్లోని పోలిస్ స్టేషన్ లేదా సర్పంచ్, మండల కార్యాలయాల్లో నమోదు చేయించుకోవాలని... అందరి కడుపులను నింపుతామని హామీ ఇచ్చారు. స్వస్థలాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం.

సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, జాతీయ ఛానెళ్ల జర్నలిస్టులు, సినీ తారలు సోనూసూద్, మంచు లక్ష్మి, ప్రియా ఆనంద్‌, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నెటిజన్లు కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నిజమైన నాయకుడు మీరేనని ఆకాశానికెత్తారు. కేసీఆర్‌ను చూసి మిగతా రాష్ట్రాల సీఎంలు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రం అయినప్పటికీ హిందీలో అదరగొట్టారని.. మీ లాంటి సబ్జెక్ట్ ఉన్న నాయకుడే ప్రజలకు కావాలని పొగడ్తల్లో ముంచెతారు. వాటిలో కొన్ని ట్వీట్లు ఇక్కడ చూడండి.


First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading