Home /News /telangana /

CORONAVIRUS 50 CORONA POSITIVE CASES RECORDED IN TELANGANA TODAY SK

తెలంగాణలో ఇవాళ 50 పాజిటివ్ కేసులు.. మంత్రి ఈటల ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని.. ముగ్గురు పేషెంట్లకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోదని ఈటల రాజేందర్ చెప్పారు.

    తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఒక్క రోజే 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వీటిలో 90శాతం కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఇవాళ కరోనాతో ఎవరూ చనిపోలేదని చెప్పారు ఈటల. మరో 68 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని.. వారందరినీ డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవాళ్టి కేసులను కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700కు చేరింది. రాష్ట్రంలో ఉన్న కరోనా బాధితుల్లో కేసుల్లో సగంపైగా కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. GHMC పరిధిలో ప్రస్తుతం 240 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా..134 మంది డిశ్చార్జి అయ్యారు.
    తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రకటన


    రాష్ట్రంలో నమోదైన మొత్తం 700 కరోనా కేసుల్లో 645 మంది మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వాళ్లే ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని.. ముగ్గురు పేషెంట్లకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోదందని ఆయన అన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి పెంచామని ఈటల తెలిపారు. ఏప్రిల్ 20న ఆ ఆస్పత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్ల కోసం 10లక్షల పీపీఈ సూట్స్, 10లక్షల ఎన్‌95 మాస్కులు, ఆస్పత్రుల్లో గాగుల్స్‌, వైద్య పరికరాలు సమకూర్చుకుంటున్నామని.. వైద్య సిబ్బందితో పాటు రక్షణ సిబ్బందికి కూడా పీపీఈ సూట్స్, మాస్కులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Eetala rajender, Hyderabad, Telangana

    తదుపరి వార్తలు