మర్కజ్ కరోనా కేసుల గురించి కేంద్రానికి చెప్పింది మేమే: మంత్రి ఈటల

మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణలో మొత్తం 97 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాారు. ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందారు.

 • Share this:
  తెలంగాణలో మర్కన్ ప్రార్థనల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన చాలా మందికి కరోసా సోకింది. వారందరినీ గుర్తించి పరీక్షలు చేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ నుంచి 1000 మందికి పైగా ప్రార్థనలకు హాజరయ్యారని.. వారిలో 160 మందిని మినహా అందరినీ గుర్తించామని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించామంటే.. తమ చిత్తశుద్ధేంటో అర్థం చేసుకోవచ్చన్నారు మంత్రి. మర్కజ్ కేసుల నుంచి కేంద్రానికి ముందుగా చెప్పింది తామేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (సమూహ వ్యాప్తి) లేదని స్పష్టం చేశారు మంత్రి ఈటల.

  కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా పనిచేస్తోంది. అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని ముందు తెలంగాణే కేంద్రానికి చెప్పింది. అన్ని రాష్ట్రాల కంటే ముందే మనం లాక్‌డౌన్ ప్రకటించాం. మర్కజ్ కేసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది కూడా తెలంగాణే. కేంద్రం ఇంకా యాక్టివ్‌గా పనిచేయాలని. కరోనాపై జరుగుతున్న పోరాటంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు పరీక్షలు నిర్వహించగా 10 మందికి నెగెటివ్ వచ్చింది. ఇవాళ ఇద్దరిని డిశ్చార్జి చేస్తాం.
  ఈటల రాజేందర్, వైద్యఆరోగ్యశాఖ మంత్రి


  తెలంగాణలో నిన్న రాత్రి వరకు మొత్తం 97 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాారు. ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 77 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితోనే రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: