CORONA VIRUS SPREADING THROUGH AIR ALSO TELANGANA HEALTH DIRECTOR SENSATIONAL COMMENTS FULL DETAILS HERE HSN KMM
Corona Virus: గాలి ద్వారా కూడా కరోనా.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ కట్టుకోండి.. సంచలన కామెంట్స్ తో కలకలం..!
ప్రతీకాత్మక చిత్రం
ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు.
ఏడాది క్రితం ప్రపంచంలోని అన్ని దేశాలను వణికించిన కరోనా మళ్లీ జడలువిప్పుతోంది. రూపం మార్చుకుని మరీ మానవాళిపై దాడి చేస్తోంది. ప్రపంచదేశాలన్నింటినీ చుట్టేస్తోంది. ఏడాది క్రితం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సీన్ అయితే కనిపించిందో, ప్రజల్లో ఎలాంటి భయం అయితే కలిగిందో, అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. లాక్ డౌన్ ఆలోచనలు, కరోనా కేసుల సంఖ్య మరింత పెరగడాలు, మృతుల సంఖ్య రోజు రోజుకు అధికమవడాలు. ఇవే సీన్లు ఏడాది క్రితం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తాజాగా ఇప్పుడు కూడా మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది. అయితే తాజాగా ఓ భయంకరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తోందని ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు.
గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మరో మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు.
ముందు ముందు ఆస్పత్రిలో బైడ్స్ కూడా దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని ఆయన వాపోయారు. ఆర్థిక ఇబ్బందులు రావద్దని లాక్ డౌన్ కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదనీ, కానీ తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలనీ, ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. హెల్త్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ తో సామాన్య ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కరోనా వైరస్ గాల్లో అతి కొద్ది సమయం మాత్రమే బతికి ఉంటుందనీ, గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదనీ ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. తాజాగా శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ అందరిలోనూ వణుకుపుట్టిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.