హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: దుబ్బాకలో ఇలా ఓటేసిన కరోనా పేషెంట్లు

Dubbaka: దుబ్బాకలో ఇలా ఓటేసిన కరోనా పేషెంట్లు

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కరోనా బాధితుడు

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కరోనా బాధితుడు

Dubbaka By Elections: కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.. ఓటింగ్ ముగిసే సమయంలో కరోనా పేషెంట్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు.

  సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. చేతి తొడుగులు ధరించి, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. అందరూ ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.. ఓటింగ్ ముగిసే సమయంలో కరోనా పేషెంట్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దాదాపు 10 మందికిపైగా కరోనా పేషెంట్లు పీపీఈ కిట్లు ధరించి వచ్చి తమ ఓటు వినియోగించుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలకు వారికి ఓటింగ్ సమయంలో సూచనలు చేశారు.

  పోలింగ్ బూత్‌ల వద్ద కేటాయించిన ప్రత్యేక లైన్లలో గర్భిణులు, దివ్యాంగులకు వీల్ చైర్లలో వచ్చి ఓటు వేశారు. కరోనా బాధితులు పిపి కిట్లు ధరించి వారికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్‌ భారతి హొళికెరితో పాటు ఉన్నతాధికారులు... ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీపీ జోయెల్ డేవిస్ శాంతి భద్రతలు పర్యవేక్షించారు. ఉదయం 7గంటలకు ప్రక్రియ ప్రారంభం కాగా... నమోదైన పోలింగ్‌ వివరాలను ప్రతి 2 గంటలకొకసారి పోలింగ్ సరళిని అధికారులు వెల్లడించారు.

  Dubbaka by elections, corona virus, covid 19 patients in dubbaka, trs, bjp, congress, దుబ్బాక ఉప ఎన్నికలు, కరోనా వైరస్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్
  ఓటు వేసేందుకు వేచి ఉన్న కరోనా బాధితుడు

  ఇక ఉదయం 9గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదు కాగా... 11 గంటల వరకు 34.33 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10శాతం, 4 గంటల వరకు 78.12శాతం 5 గంటలకు 81.44శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపఎన్నిక కోసం నియోజకవర్గవ్యాప్తంగా 315 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాయపోల్‌ మండలం ఆరేపల్లిలో 20 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించింది. ఇదే సమయంలో పలువురు కార్యకర్తలు కేంద్రంలోకి చొచ్చుకెళ్లగా... పోలీసులు వారందరినీ బయటికి పంపించారు. మరో యంత్రాన్ని తీసుకువచ్చి అధికారులు పోలింగ్ కొనసాగించారు.

  ఓటు వేసేందుకు వచ్చిన కరోనా బాధితుడికి సూచనలు చేస్తున్న ఆరోగ్య కార్యకర్త

  బూత్‌ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల, పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ లచ్చపేటలో పర్యటించి... పోలింగ్‌ పరిస్థితిని పరిశీలించారు. అంతకుముందు లచ్చపేట పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికెరి పరిశీలించారు. నార్సింగిలోని పోలింగ్ కేంద్రాన్ని సిద్దిపేట CP జోయల్ డేవిస్ పరిశీలించారు. ఈనెల 10న దుబ్బాక ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు