బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపై కరోనా ఎఫెక్ట్

Balapur Ganesh: ఎప్పటికప్పుడు భారీ మొత్తానికి వేలంలో అమ్ముడుపోయే బాలాపూర్ వినాయకుడిని లడ్డూ... గతేడాది వేలంలో రూ. 17.60 లక్షలు పలికింది.

news18-telugu
Updated: July 23, 2020, 3:19 PM IST
బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంపై కరోనా ఎఫెక్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడి తరువాత అంతటి ఖ్యాతి దక్కించుకున్న బాలాపూర్ గణేష్ ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా ఈసారి గణేష్ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని పలు రాష్ట్రాల్లోని ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా... తాజాగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సైతం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బాలాపూర్‌లో 6 అడుగుల గణేష్ విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. గతేడాది 21 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయగా... ఈసారి మాత్రం కేవలం 6 అడుగుల విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలాన్ని ఈ ఏడాది కమిటీ రద్దు చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలాన్ని అత్యంత భారీగా నిర్వహిస్తుంటారు. ఎప్పటికప్పుడు భారీ మొత్తానికి వేలంలో అమ్ముడుపోయే బాలాపూర్ వినాయకుడి లడ్డూ... గతేడాది వేలంలో రూ. 17.60 లక్షలు పలికింది. అయితే ఈసారి ఈ వేలాన్ని రద్దు చేశారు. ఇక బాలాపూర్ వినాయకుడి నిమజ్జనానికి బయలుదేరితేనే... నగరంలో వినాయక నిమజ్జనం ఉత్సవం మొదలైనట్టు అధికారంగా భావిస్తుంటారు. అంతేకాదు ఈ ఏడాది బాలాపూర్ వినాయకుడి దర్శనంతో పాటు భక్తుల పూజలను కూడా రద్దు చేశారు. ఇక బాలాపూర్ వినాయకుడి తొలిపూజ సైతం కేవలం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మాత్రమే జరగనుంది.
Published by: Kishore Akkaladevi
First published: July 23, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading