Corona Alert : హైదరాబాద్‌లో కరోనా టెన్షన్... పెరుగుతున్న భయాందోళనలు

Corona Virus Alert : కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై తాజాగా అప్‌డేట్ ఇవ్వలేదు. హైదరాబాద్‌లో వైరస్ ఉందో లేదో స్పష్టం చెయ్యలేదు. అందువల్ల ఇప్పటికైతే... తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లేదు అని అనుకోవచ్చు.

news18-telugu
Updated: January 28, 2020, 5:39 AM IST
Corona Alert : హైదరాబాద్‌లో కరోనా టెన్షన్... పెరుగుతున్న భయాందోళనలు
హైదరాబాద్‌లో కరోనా టెన్షన్... పెరుగుతున్న భయాందోళనలు
  • Share this:
Corona Virus Alert : ఎవరూ ఊహించని పరిణామం ఇది. 2020లో ఓ వ్యాధి ఇంతలా ప్రపంచాన్ని భయపెడుతుందని ఎవరూ అనుకోలేదు. ముఖ్యంగా ఇండియాలో ఈ వ్యాధి ఇంకా ఎవరికీ సోకకపోయినా... సోకినట్లే ఫీలవుతున్నారు దేశ ప్రజలు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో నలుగురికి వైరస్ సోకిందనే సోషల్ మీడియా ప్రచారం వల్ల... ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. నిజానికి ఆ నలుగురికీ కరోనా వైరస్ సోకలేదని తెలుస్తున్నా... డాక్టర్లు అసలు విషయాన్ని దాచిపెడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. అందువల్ల కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తుందేమోనన్న టెన్షన్ ప్రజల్లో ఎక్కువైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం డోంట్ వర్రీ అంటోంది.




కరోనా వ్యాధి ఇప్పుడు మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి కన్నీటిని తుడిచినా చాలు... అందులో వైరస్... తుడిచిన వ్యక్తుల చేతులకు పాకి... అక్కడి నుంచీ వారి నోటి ద్వారా పొట్టలోకి వెళ్లి... ఊపిరితిత్తుల్ని చేరి... ప్రాణం తీయగలదని డాక్టర్లు తేల్చారు. అందువల్ల అదేపనిగా దగ్గుతూ, ముక్కు నుంచీ నీరు కారుతూ, జ్వరంతో బాధపడుతున్నట్లైతే... అలాంటి వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి వారి వివరాల్ని వెంటనే డాక్టర్లకు తెలపాలని చెబుతున్నారు. ఇలా చెబుతుండటంతో... సాధారణంగా జ్వరం వచ్చినా... అది కరోనాయేమో అన్న టెన్షన్ ప్రజల్లో పెరిగిపోతోంది. ఇప్పుడు ఫీవర్ ఆస్పత్రికి అనుమానంతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్ని కేంద్రం నోడల్‌ ఆస్పత్రులుగా ప్రకటించింది. వీటిలో ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేసింది.

చైనాలో కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. 2744 మంది వ్యాధితో బాధపడుతున్నారు. మరో 5794 మందిపై అనుమానాలున్నాయి. ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. వైరస్ వచ్చిన వారంతా చనిపోవట్లేదు. తాజాగా 51 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు కూడా. అంటే... ఈ వైరస్ వచ్చినంత మాత్రాన చనిపోతారని అనుకోవాల్సిన పనిలేదు. ధైర్యంగా, కాన్ఫిడెన్స్‌తో ఉంటే... అదే వైరస్‌పై విజయం సాధించేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో ఎండాకాలం మొదలవుతోంది కాబట్టి... మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు. మరో పది రోజులైతే... వైరస్ దానంతట అదే పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేడి పెరిగే కొద్దీ ఆ వైరస్ బతకడం కష్టం.
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు