కరోనా టీకా తీసుకోకున్నా , వారి పేరుమీద సర్టిఫికెట్స్ డౌన్లోడ్ కావడమే కాదు ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసెజ్లు రావడంతో కుటుంబ సభ్యులు ఖంగుతింటున్నారు...అయితే ఇదంతా అధికారుల తప్పిదమా లేక, సాఫ్ట్వేర్ ప్రాబ్లమా అనేది తేలాలి. మొత్తం మీద టీకా వేసుకోని వారికి కూడా వేసుకున్నట్టు గత కొద్ది రోజులుగా మెసెజ్లు వస్తున్నాయి. దీంతో వారు ఖంగు తింటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఎక్కడో ఓ చోట ఇలాంటి మెసెజ్ పోందుతున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తికి కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్టు మెసెజ్ రావడంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కొడిశాల రాజశేఖర్ అనే వ్యక్తి గత సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన కోవిడ్ టీకా తీసుకున్నాడు. టీకా తీసుకున్న 10 రోజులకు కోవిడ్ బారిన పడటంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ మదీనగూడా లోని అర్చన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సకు సుమారు 20 లక్షల వరకు కుటుంబ సభ్యులు ఖర్చు చేశారు. అయినా అతను చికిత్స పొందుతూ అదే నెల 27 వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియలు కూడా ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.
Nagarkarnool : రైతు వినూత్న నిరసన.. తనను తీసుకుపోని బస్సుకు అడ్డంగా పండ్ల బుట్టలు,
ఇక హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డెత్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. అయితే ఆ వ్యక్తి ఈ నెల 28(శుక్రవారం)న కోవిడ్ సెకండ్ డోస్ తీసుకున్నట్టుగా కోవిడ్ పోర్టల్ లో ఎంట్రీ చేశారు. దాంతో అతను రెండు డోసులు విజయవంతంగా పూర్తి చేసినట్టుగా అతను వాడిన మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కోవిడ్ పోర్టల్ లింకు ఓపెన్ చేయగా రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసినట్టుగా సర్టిఫికెట్ డౌన్ లోడ్ అయింది. ఇంకేముంది..కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Medaram Jatara : మేడారం జాతరపై స్పష్టత.. ఇచ్చిన మంత్రులు..ఏర్పాట్లపై సమీక్ష
అయితే ఇటీవల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, జిల్లాలో కిందిస్థాయి వైద్యాధికారులకు పై అధికారులు వ్యాక్సినేషన్ టార్గెట్ ఇవ్వడంతో ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ వేశారు. అయితే టార్గెట్ పూర్తి చేయడం కోసమే అధికారులు ఇలా ఆన్లైన్ ఎంట్రీలు చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ టార్గెట్ పూర్తి చేసామని వైద్యశాఖ చెప్తున్న దాంట్లో నిజమెంత అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Kamareddy