• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CORONA UPDATES BIOLOGICAL VACCINE MAY AVAILABLE IN INDIA FROM AGUST SAYS NITI AYOG SK

Corona Vaccine: గుడ్‌న్యూస్.. మూడో భారతీయ టీకా రెడీ.. ఇది కూడా హైదరాబాద్ నుంచే

Corona Vaccine: గుడ్‌న్యూస్.. మూడో భారతీయ టీకా రెడీ.. ఇది కూడా హైదరాబాద్ నుంచే

ప్రతీకాత్మక చిత్రం

త్వరలోనే మూడో వ్యాక్సిన్ వస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌లోని బయోలాకిల్ ఈ (బీఈ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఆగస్టు నాటికి అందుబాటులోకి రాబోతోంది. ఒకటి, రెండో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి.

  • Share this:
    భారత్‌పై కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. కోవిడ్ వైరస్ ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లతో పంజా విసురుతోంది. నిత్యం మూడు లక్షల మంది కోవిడ్ బారినపడుతున్నారు. జనం పిట్టల్లా రాలుతున్నారు. ఐతే కరోనాను కట్టడి చేసేందుకు ప్రస్తుతం మన దేశంలో రెండు టీకాలను వినియోగిస్తున్నారు. భారత్ బయోటెక్ (హైదరాబాద్) కంపెనీ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాతో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ (పుణె) తయారుచేసి కోవిషీల్డ్ టీకాను వేస్తున్నారు. ఈ రెండు మనదేశంలో తయారయ్యాయి. ఇక రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ టీకాలు కూడా మరికొన్ని రోజుల్లో భారత్‌కు రానున్నాయి. ఐతే ప్రస్తుతం ఉన్న టీకాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. చాలా చోట్ల టీకాల కొరత నెలకొంది.

    ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి పెరగడంతో పాటు కొత్త టీకాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలోనే మూడో వ్యాక్సిన్ వస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌లోని బయోలాకిల్ ఈ (బీఈ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఆగస్టు నాటికి అందుబాటులోకి రాబోతోంది. ఒకటి, రెండో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. త్వరలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు కానున్నాయి. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం బయోలాజికల్ ఈకి ఉంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింతగా ఊపందుకుంటుందని నీతి ఆయోగ్ సభ్యులు వీకే కౌల్ తెలిపారు.

    అంతేకాదు బయోలాకిల్ ఈ మరో వ్యాక్సిన్‌ కూడా తయారు చేయబోతోంది. క్వాడ్ వ్యాక్సిన్ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా అమెరికాలోని జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఈ తయారుచేయనుంది. 2022 డిసెంబరు నాటికి బీఈ ద్వారా 100కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ కూడా ఆగస్టులోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అమెరికా ఔషధ కంపెనీ నోవా వ్యాక్స్, సీరం ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి మరో టీకాను సెప్టెంబరులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ మరో వ్యాక్సిన్ కూడా తయారు చేస్తోంది. ముక్కు ద్వారా ఇచ్చే ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అక్టోబరులో అందుబాటులోకి రావచ్చని సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published: