Covid 19: వామ్మో... ఆ సిగరెట్ పొగతో... 18 మందికి కరోనా పాజిటివ్... ఎలాగంటే...

వామ్మో... ఆ సిగరెట్ పొగతో... 18 మందికి కరోనా పాజిటివ్... ఎలాగంటే... (ప్రతీకాత్మక చిత్రం)

Covid 19: మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదు అనే రూల్ ఉంది. అయినా తాగుతున్నారు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఫలితం... 18 మందికి కరోనా సోకింది.

  • Share this:
    Covid 19: ఒకరు చేసిన తప్పుకి... మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే. ఒక్క వ్యక్తి కాల్చిన సిగరెట్ వల్ల... 18 మందికి కరోనా సోకింది. ఇది జరిగింది మన హైదరాబాద్‌లోనే. శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్న ఓ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఆమధ్య ఆఫీస్ పనిపై బయటకు వెళ్లాడు. వెళ్తూ... వెళ్తూ... KBR పార్క్‌ దగ్గర ఆగాడు. వాహనదారులు ఎవరి పనులపై వారు బిజీగా వెళ్లిపోతున్నారు. వారిని అలా చూసిన మేనేజర్‌కి ఓ సిగరెట్ తాగాలి అనిపించింది. కానీ మ్యాచ్ బాక్స్ లేదు. ఆ పక్కనే ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు. ఆయన దగ్గరకు వెళ్లి... "మాస్టారూ... ఓసారి మీ సిగరెట్ ఇస్తారా... నా సిగరెట్ అంటించుకుంటాను" అని అడిగితే :దాందేముంది తీసుకోండి" అని ఇచ్చాడు అతడు. హమ్మయ్య అనుకుంటూ... తన సిగరెట్ అంటించుకున్న మేనేజర్... దాన్ని కాల్చుకుంటూ... గుప్పుగుప్పున పొగ వదులూ పనిమీద వెళ్లిపోయాడు.

    మూడు రోజుల తర్వాత జ్వరం, ఒంటి నొప్పులు బాగా వచ్చాయి. అడుగుతీసి అడుగు వేయలేయలేకపోయాడు. ఊపిరి ఆడట్లేదు. దాంతో కుటుంబ సభ్యులు సీటీస్కాన్‌ చేయించారు. కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతని ఊపిరితిత్తులు 30 శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. మార్కెటింగ్‌ టీమ్‌కు హెడ్‌ అయిన ఆయన విషయాన్ని తన టీం సభ్యులకు చెప్పాడు. వాళ్లు మొత్తం 20 మంది ఉన్నారు. వాళ్లంతా టెస్టులు చేయించుకుంటే... వాళ్లలో 18 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. అందరూ ఐసోలేషన్ అయ్యారు. ఐతే... ఆ 18 మంది నుంచి ఇంకెంత మందికి కరోనా సోకిందో ఇప్పుడు పరిశీలిస్తున్నారు.

    మేనేజర్‌ వల్లే తమకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని కంపెనీ హెచ్‌ఆర్‌ ముందు అందరూ చెప్పారు. దాంతో... మేనేజర్... తనకు కరోనా ఎలా సోకింది అనేదానిపై ఆలోచించాడు. వారం నుంచి ఆయన ఎవరెవర్ని కలిశాడో డాక్టర్లకు చెప్పాడు. ఆ క్రమంలో... సిగరెట్ వెలిగించుకున్నప్పుడు ఓ వ్యక్తి దగ్గర సిగరెట్ తీసుకొని... వెలిగించుకున్నట్లు చెప్పాడు. అదీ... అలా అంటింది కరోనా అని డాక్టర్లు చెప్పడంతో షాక్ అయ్యాడు. చూశారా... ఒక్క సిగరెట్... ఎంత మందికి కరోనా వచ్చేలా చేసిందో.

    ఇది కూడా చదవండి: Fire Accident: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... 16 మంది కరోనా పేషెంట్లు మృతి

    మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదు అనే రూల్ ఉంది. అయినా తాగుతున్నారు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఆ రూల్ పక్కాగా అమలై ఉంటే... ఆ వ్యక్తి సిగరెట్ తాగేవాడు కాదు... అతని నుంచి ఈ మేనేజర్ సిగరెట్ తీసుకునేవాడు కాదు... తద్వారా ఎవరికీ కరోనా సోకేది కాదు. మరి ఇంకా ఎంత మందికి వైరస్ పాకిందో ఏమో. మనమంతా జరంత జాగ్రత్తగా ఉండాల్సిందే.
    Published by:Krishna Kumar N
    First published: