హోమ్ /వార్తలు /తెలంగాణ /

పేషెంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టంకి పేటెంట్ పొందిన మాజీ ఎంపీ...

పేషెంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టంకి పేటెంట్ పొందిన మాజీ ఎంపీ...

పేషెంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టంకి పేటెంట్ పొందిన మాజీ ఎంపీ... (File)

పేషెంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టంకి పేటెంట్ పొందిన మాజీ ఎంపీ... (File)

Corona Lockdown | Corona Update : పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వాళ్లను ట్రాన్స్‌ఫర్ చెయ్యడం కష్టమైన పని. దానికి మాజీ ఎంపీకి పేటెంట్ లభించింది.

Corona Lockdown | Corona Update : ఇది కరోనా కాలం. ఈ రోజుల్లో ఎవరికైనా కరోనా వస్తే... వారిని ఆస్పత్రుల్లో ట్రాన్స్‌ఫర్ చెయ్యడం చాలా కష్టం. అటు పేషెంట్లకు, ఇటు డాక్టర్లకూ అందరికీ అది సవాలే. ఇలాంటి అంశంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి టీమ్ ఓ కొత్త విధానాన్ని సృష్టించింది. అదే పేషెంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టం. దానికి పేటెంట్ దక్కేలా చేసుకున్నారు మాజీ ఎంపీ. 2011లో దీన్ని తయారుచెయ్యగా... 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు దీనికి పేటెంట్ లభించింది. కేంద్ర ప్రభుత్వ పేటెంట్ల నియంత్రణ సంస్థ నుంచి పేటెంట్ పొందినట్లుగా ఎక్స్ ఎంపీ.. ట్విట్టర్‌లో తెలిపారు. సరైన సయమంలో పేటెంట్ లభించిందని వివరించారు.

ఈ కొత్త విధానంలో... ఆస్పత్రి సిబ్బంది... కరోనా పాజిటివ్ పేషెంట్ల నుంచి సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యడానికి వీలవుతుంది. పేషెంట్లను బెడ్ నుంచి స్ట్రెచర్‌పైకి స్వయంగా ఆస్పత్రి సిబ్బంది తీసుకెళ్లే అవసరం ఉండదు. ఇది పేషెంట్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని మాజీ ఎంపీ చెప్పారు.

ఈ ఐడియా రావడానికి 2010లో జరిగిన ప్రమాదమే కారణం అన్నారాయన. బైక్ యాక్సిడెంట్‌లో తన పక్కటెముకలు దెబ్బతిన్నాయనీ... మూడు నెలలపాటూ బ్యాండేజీలతో బెడ్‌పై ఉన్నానని తెలిపారు. గ్రామీణ యువకులు తనకు చాలా స్కిల్స్ నేర్పారన్న ఆయన.. తాను బెడ్ పై ఉన్నప్పుడే... వారి సాయంతో ఈ ట్రాన్స్‌ఫర్ సిస్టంను తయారు చేశామని తెలిపారు.

ఈ కొత్త విధానంలో పేషెంట్‌ ఎలాంటి కుదుపులూ లేకుండా ట్రాన్స్‌ఫర్ అవుతారు. బెడ్ నుంచి స్ట్రెచర్ పైకి ఈజీగా పంపవచ్చు. ఐతే... కాలిన గాయాలున్న పేషెంట్ల విషయంలో మాత్రం ఈ కొత్త విధానం పనిచెయ్యదని ఆయన వివరించారు. కొత్త విధానాన్ని ఒక వ్యక్తే ఆపరేట్ చెయ్యవచ్చనీ లేదా... ఇద్దరు కూడా చెయ్యవచ్చని కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. రీచార్జి బ్యాటరీలతో ఈ పరికరం పనిచేస్తుందనీ... మొత్తం 150 కేజీల బరువు మొయ్యగలదని వివరించారు. దీనికి ఇప్పటికే అమెరికా నుంచి కూడా పేటెంట్ పొందినట్లు కొండా తెలిపారు.

First published:

Tags: Coronavirus, Covid-19, Konda Vishweshwar reddy

ఉత్తమ కథలు