హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana corona : మరోసారి కరోనా నిబంధనలు.. మాస్క్ లేనివారికి 1000 జరిమాన

Telangana corona : మరోసారి కరోనా నిబంధనలు.. మాస్క్ లేనివారికి 1000 జరిమాన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana corona : తెలంగాణలో మరోసారి కోవిడ్ నిబంధణలు అమల్లోకి వచ్చాయి. (Rs 1000 fine to no mask ) కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన రాష్ట్ర భుత్వం మాస్క్ ధరించని వారిపై 1000 రూపాయల జరిమాన విధించనున్నట్టు తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఇంకా చదవండి ...

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం తెలంగాణలోను పడింది. ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టివస్తున్న ఒమిక్రాన్ తాజాగా భారత్‌లో కూడా అడుగుపెట్టే అడుగు పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. (Rs 1000 fine to no mask ) దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. దీంతోపాటు నిబంధనలు కూడా అమలు చేయనున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలు మాస్క్ లేకుండా బయటకు రావద్దని తెలిపారు. (Rs 1000 fine to no mask ) మాస్క్ తప్పని సరి అంటూ పేర్కోన్నారు. లేదంటే వేయి రూపాయల జరిమానాను నేటి నుండి మరోసారి అమల్లోకి తెస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ క్రమంలోనే ఆయన పలు అంశాలను మీడియాకు వివరించారు. ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.. కొత్త వేరియంట్ కట్టడిపై సీఎం అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన వివరించారు. (Rs 1000 fine to no mask ) దీంతో మరోసారి ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

Cyber crime :దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం .. ఎస్పీఐ పేరిట కాల్ సెంటర్.. వందల కోట్లు కాజేసిన ముఠా..!


ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు.. రెండో డోస్‌ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు వాస్తవ రూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చిరించారు.

ఇక విదేశాల నుండి నిన్న వచ్చిన సుమారు 265 మందికి పరీక్షలు నిర్వహించామని అయితే వారిలో ఒకరికి ఒమిక్రాన్ లక్షణాలపై అనుమానం వచ్చిందని చెప్పారు.. కాగా బాధితుడిని టిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.. అతడి నమూనాలను జీనోమ్‌కు పంపాం . (Rs 1000 fine to no mask ) ఫలితాలు వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుందని చెప్పారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అది మూడు దేశాల నుండి 24 దేశాలకు పాకిందని చెప్పారు.


Karimnagar : అక్రమ సంబంధం అంటగట్టిన మామపై దారుణం.. అర్థరాత్రి మరో యువకుడితో కలిసి..


దీంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాస్కులు లేని వారికి పోలీసులు గతంలో వేయి రూపాయల జరిమాన విధించారు. కాగా కోవిడ్ నిబంధనలు ఎత్తివేయడంతో చాలా మంది మాస్కులు ధరించడం మానేశారు. (Rs 1000 fine to no mask ) ఇక తాజాగా రోడ్లపై పోలీసుల పికేటింగ్‌లో పాటు ఫంక్షన్ హాల్లు ,పబ్లిక్ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Corona alert, Hyderabad

ఉత్తమ కథలు