ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణ జిల్లా తిరువూరు సమీపంలోని విస్సనపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి(22) నిండు చూలాలు. ఇంతలోనే ఆమెను కరోనా సోకింది. నిండు గర్భిణీ కావడం, పాజిటివ్ సోకడంతో తిరువూరు కు చెందిన వైద్యులు పురుడు పోసేందుకు వెనుకడుగు వేశారు. మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో భార్యాభర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పురుడు కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయోమయంలో పడ్డారు.
సుబ్బలక్ష్మి భర్త రాంబాబుకు సమీప బంధువు అయిన ఖమ్మం నగరం 59 వ డివిజన్ దానవాయి గూడెం జూబ్లీ పుర సెక్టార్ కు చెందిన అంగన్వాడీ టీచర్లు జి.పద్మ, ఉమా ...ఆర్పీ అరుణ ల సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ సోకిన గర్భిణీ సుబ్బలక్ష్మి కి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యురాలు ప్రశాంతి, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మనోధైర్యం నింపి మీకు మేము ఉన్నామంటూ అండగా నిలిచి శనివారం ఆ గర్భిణికి నార్మల్ కాన్పు చేసి ప్రతిఒక్కరితో శభాష్ అనిపించుకున్నారు.
దీనికి సుబ్బలక్ష్మి,ఆమె భర్త రాంబాబు వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వారైనా .. కరోనా పేషంట్ అయినా వెనుకాడకుండా మానవత్వంతో స్పందించి ఆదుకున్నవైద్యులు, సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు.
కాగా గత రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు చెందిన కరోనా సోకిన గర్భిణిని పలు ఆసుపత్రుల చుట్టు తిప్పతూ..చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకున్న సంఘటన నెలకొంది. మరోవైపు ఇదే పరిస్థితి సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళకు కూడను ఇక్కడ అక్కడ అంటూ ఇద్దరు కవల పిల్లల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న సంఘటనలు వెలుగుచూశాయి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Khammam, Pregnant women