• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CORONA POSITIVE TO MINISTER KTR ASLO NETIZENS SATIRICAL COMMENTS ON KCR TAKING TREATMENT IN YASODHA HOSPITAL HSN

CM KCR- KTR: యశోదా ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. గాంధీ ఆస్పత్రిలో ఖాళీ లేకనే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

CM KCR- KTR: యశోదా ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. గాంధీ ఆస్పత్రిలో ఖాళీ లేకనే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటోలు)

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కరోనా రావడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. రెండు రోజుల క్రితం యశోదా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం సీఎం కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

  • Share this:
    తెలంగాణలో కరోనా తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్నాయి. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల అనంతరం తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూని విధిస్తూ కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా శుక్రవారం మంత్రి కేటీఆర్ కూడా తనకు కరోనా పాజిటివ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కరోనా రావడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. రెండు రోజుల క్రితం యశోదా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం సీఎం కేసీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

    ‘దయచేసి కేటీఆర్ గారిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించండి‘ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘ అన్నా, గాంధీ ఆస్పత్రిలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు‘ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘ఓ పారాసిటమాల్ బిళ్ల వేసుకుని ఫామ్ హౌస్ లోనే ఉండండి. ఆరోగ్యం విషమిస్తే గాంధీ ఆస్పత్రిలో చేరండి‘ అంటూ రఘు గౌడ్ నకిరెకంటి అనే నెటిజన్ ట్వీట్ చేశాడు.









    ‘గాంధీలో బెడ్స్ ఖాళీగా లేవు. కాబట్టి ఇద్దరు పేషెంట్లను యశోదాకు షిఫ్ట్ చేసి వారిద్దరి ప్లేసుల్లో కేసీఆర్, కేటీఆర్ గారికి చికిత్సను ఇప్పిద్దాం‘ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘కరోనా సోకిన తర్వాత ఒక్కసారయినా కేసీఆర్ గారు గాంధీ ఆస్పత్రికి వెళ్లారా? కనీసం ఏ కొవిడ్ కేర్ సెంటర్ కు అయినా వెళ్లారా?‘ అని రాం ప్రసాద్ గౌడ్ అనే నెటిజన్ ప్రశ్నించాడు.



    ‘పాలకునికో న్యాయం, ప్రజలకో న్యాయమా? మీరెందుకు గాంధీ ఆస్పత్రిలో చేరరు? మీవే ప్రాణాలా? ప్రజలవి ప్రాణాలు కావా?‘ అంటూ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ గారు కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటుండటం సంతోషదాయకం. కాకపోతే ఆయన సామాజిక వర్గానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లడం మాత్రం విచారకరం. ప్రభుత్వ ఆసుపత్రులపై ముఖ్యమంత్రికే నమ్మకం లేకుంటే ఎలా?‘ అంటూ ప్రొఫెసర్ సింహాద్రి ట్వీట్ చేశారు. మొత్తానికి కేసీఆర్ గతంలో చేసిన కామెంట్స్ వల్లే ఈ స్థాయిలో సెటైర్లు పేలుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు