Home /News /telangana /

Corona to students : గురుకుల విద్యార్థులకు కరోనా కలకలం... 40మందికి పాజీటివ్..

Corona to students : గురుకుల విద్యార్థులకు కరోనా కలకలం... 40మందికి పాజీటివ్..

corona

corona

Corona to students : గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తోంది. ఇటివల నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాల గురుకులాల్లో కరోనా కలకలం చెలరేగగా... ( corona positive to student in Telangana ) తాజాగా సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా పాజీటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.

ఇంకా చదవండి ...
    కరోనా తెలంగాణ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విజృంభిస్తోంది. గత కొద్ద రోజులుగా తగ్గుముఖం పడుతుందని బావిస్తున్న తరుణంలో మరోసారి ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లతో పాటు పలువురు ప్రముఖులకు కూడా కరోసా సోకుతోంది. ( corona positive to student in Telangana ) ఇప్పటికే ఇటివల రాష్ట్రంలోని పలు స్కూళ్లలో ముఖ్యంగా గురుకులాల్లో కరోనా ఉదృతి పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు లోని మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో
    కరోనా కలకలం రేపింది.. కాలేజీతో పాటు స్కూళు విద్యార్థులు ఉంటున్న గురుకులంలో సుమారు 43 మంది కరోనా భారిన పడ్డారు. ( corona positive to student in Telangana ) ఇటివల ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో గత రెండు రోజుల నుండి గురుకులంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో మొత్తం 270 మందికి పైగా ఉన్న విద్యార్థుల్లో 43మందికి కరోనా పాజీటివ్‌గా తేలింది. దీంతో విద్యార్థులతో పాటు , తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనాకు గురైన విద్యార్థులకు వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు ఆ జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు తాత్కాలికంగా గురుకులంతో పాటు దానికి సంబంధించి విద్యాసంస్థలకు సేలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది.

    వారం రోజుల క్రితమే ఖమ్మంలోని గురుకుల స్కూళ్లో ఏకంగా 27 మందికి కరోనా సోకినట్టు నిర్థారణ అయింది.అంతకు ముందు నల్గొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కూడా 25 మంది విద్యార్థులకు కరోనా పాజీటివ్ తేలింది. దీంతో ఆయా జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది.

    Cabinet Meeting : సీఎం అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం..యాసంగి పంటలపై కీలక నిర్ణయం


    Kishan reddy on kcr : హుజూరాబాద్ సెగ ఢిల్లీకి చేరింది.. కొడుకును సీఎం చేయడానికే.. రాద్దాంతం


    Nizamabad : ఏటిఎంలో.. చెవిటి-మూగ దొంగతనం.. మోగిన అలారం.. ట్విస్ట్ మాములుగా లేదుగా


    ఇక రెండు రోజుల క్రితమే.. టెక్‌ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురి టీచింగ్ స్టాఫ్‌కు కొవిడ్‌ సోకింది.( corona positive to student in Telangana ) దీంతో స్థానిక వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 30 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపారు. వర్సిటీ సిబ్బందికి, సమీపంలోని దుకాణదారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ( New corona cases in Telangana ) కరోనా నేపథ్యంలో వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారంతా టీకా రెండు డోసులు తీసుకున్నవారే గమనార్హం.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు