Home /News /telangana /

CORONA POSITIVE TO GANDI AND OSMANIA HOSPITAL DOCTORS

Hyderabad : డాక్టర్లకు సవాల్ విసురుతున్న కరోనా.. వందల మంది వైద్యులకు పాజిటివ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : కరోనా చికిత్సకు నోడల్ ఆసుపత్రిగా ఉన్న గాంధీ వైద్యులతో పాటు పీజీ విద్యార్థులకు పెద్ద ఎత్తున కరోనా వైరస్ సోకింది. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 120 వైద్యులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
    హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతి పెరిగింది. రోజు రోజుకు కరోనాతో పాటు ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు చాలామందికి సోకుతున్నాయి. అయితే సాధారణ ప్రజలతో పాటు వైద్యం అందించాల్సి వైద్యులకు కరోనా పాకడం ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా చికిత్సకు ప్రత్యేక వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి వైద్యులకు పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ సోకింది. మరోవైపు పూర్తిగా నాన్ కోవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తున్న ఉస్మానియా వైద్యులకు సైతం కరోనా సోకడం మరింత ఆందోళన రేపుతోంది.కాగా గాంధీలో నిన్న ఒక్కరోజే 39 మంది వైద్యులకు కరోనా సోకగా అంతకు ముందే వందమంది వైద్యులకు కరోనా పాజీటివ్‌ సోకడంతో హోం క్యారంటైన్‌లో కొనసాగుతున్నారు.

    కాగా రాష్ట్రంలో నిన్న 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా. 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి కఠినమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది.

    Hyderabad : హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ కార్ రేసింగ్ .. కుదిరిన ఒప్పందం.. పోటీలు ఎక్కడంటే...

    రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని , ఎలాంటీ పరిస్థితులనైనా ఎదుర్కొనెందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కేటినెట్ కు మంత్రి హరీశ్ రావు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కో్ట్ల కరోనా టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అయితే నైట్ కర్ఫ్యూ ఇతర అంశాలపై మంత్రి వర్గం చర్చిస్తోంది. సమావేశం అనంతరం కోవిడ్ పరిస్థితులపై కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.ఇక విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona, Doctors, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు