Home /News /telangana /

CORONA POSITIVE TO A GROOM TEST RESULT CAME BEFORE 24 HOURS OF MARRIAGE LEADS TO STOP FUNCTION IN RAJANNA SIRCILLA HSN

పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడికి అనుమానం.. ఆస్పత్రికెళ్తే టెస్టుల్లో బయటపడిందో నిజం.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరో 24 గంటల్లో ఆ యువకుడి పెళ్లి. కానీ ఇంతలోనే అతడికి ఓ అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని అలాగే ఉంచడం దేనికా అనుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. టెస్టులు నిర్వహించుకున్నాడు. తీరా చూస్తే..

    దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం ఎంతటి బీభత్సాన్ని అయితే సృష్టించిందో అంతకు రెట్టించిన స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలన్నీ నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. పరిస్థితులు అదుపుతప్పిన చోట్ల లాక్ డౌన్ లు పెడుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట ఆంక్షలు విధిస్తున్నారు. కరోనాతో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల వల్ల, రాజకీయ సమావేశాల వల్ల కూడా ఈ స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఊహించని సంఘటన జరిగింది. పెళ్లికి 24 గంటల సమయం ఉందనగా ఓ షాకింగ్ నిజం తెలిసింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన ఓ యువకుడికి కొద్ది నెలల క్రితమే పెళ్లి నిశ్చయం అయింది. వధూవరులిద్దరూ పరస్పరం ఇష్టపడటంతో పెళ్లి కూడా వీలయినంత త్వరగానే పెట్టుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 23న ఆ యువకుడి వివాహం జరగాల్సి ఉంది. కానీ ఊహించని రీతిలో అతడి పెళ్లి ఆగిపోయింది. పెళ్లి పనుల కారణంగా ఆ యువకుడు బయట ఎక్కువగా తిరగాల్సి వచ్చింది. పెళ్లి కార్డులు ఇవ్వడం దగ్గరనుంచి ఇతర వ్యవహారాలను చక్కబెట్టే నిమిత్తం స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా తిరిగాడు. ఈ సమయాల్లో మాస్కులను వినియోగించలేదో ఏమో కానీ అతడికి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి.
    ఇది కూడా చదవండి: ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటుకు నిజంగా ఇంత డిమాండ్ ఉందా..? రూ.11 లక్షలు ఇస్తామని ఫోన్.. చివరకు..

    దీంతో ఏప్రిల్ 22వ తారీఖున అంటే పెళ్లికి ఒక్క రోజు ముందు కరోనా టెస్టులు చేయించుకున్నాడు. ఈ టెస్టుల్లో అతడికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. అంతే వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అటు వధువు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. మొత్తానికి అతడితోపాటు, అతడి కుటుంబ సభ్యులు అంతా హోం క్వారంటైన్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పెళ్లి పెట్టుకుందామని ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో 23వ తారీఖున జరగాల్సిన పెళ్లి కాస్తా కరోనా కారణంగా వాయిదా పడింది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Corona cases, Karimnagar, Love marriage, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు