హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona Positive Cases: మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ తప్పే కొంపముంచుతుందా..!

Corona Positive Cases: మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆ తప్పే కొంపముంచుతుందా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Positive Cases: కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని సంబరపడే లోపే థర్డ్ వేవ్ ఆనవాళ్లు అప్పుడే కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి . ఇటీవల పెరుగుతున్న కేసులే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరగవచ్చని వైద్యారోగ్యశాఖ నిపుణులు హెచ్చరిన్నారు. కరీంనగర్ జిల్లాలో థర్ద్వేవ్ ప్రభావం కనిపించకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంకా చదవండి ...

(P.Srinivas,News18,Karimnagar)

కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని సంబరపడే లోపే థర్డ్ వేవ్ ఆనవాళ్లు అప్పుడే కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి . ఇటీవల పెరుగుతున్న కేసులే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరగవచ్చని వైద్యారోగ్యశాఖ నిపుణులు హెచ్చరిన్నారు. కరీంనగర్ జిల్లాలో థర్ద్వేవ్ ప్రభావం కనిపించకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ముప్పు తొలగిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజలు ఇష్టానుసారంగా ఫంక్షన్లు , తదితర కార్యక్రమాలకు వెళ్తుండడం.. మాస్కులు ధరించకపోవడం వంటి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది.

Chief Minister KCR: దళితులకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.250 కోట్లు విడుదల..


షాపింగ్ మాల్స్ , సూపర్బజార్లు , జ్యూవెల్లరీ , వస్త్ర దుకాణాలు , కిరాణ దుకాణాల వద్ద ప్రజలు విచ్చల విడిగా తిరుగుతున్నారు . భౌతిక దూరం పాటించ కుండా , మాస్క్ లు ధరించకుండా తిరగడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది . జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడంతో కేసులు బయటపడుతున్నాయి . జిల్లాలోని 26 ప్రాథమిక , 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు హుజూరాబాద్ , జమ్మికుంట , జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు . గతంలో అరకొరగా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నిర్ధారణ పరీక్షల కోసం జనం రెండుమూడు రోజుల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది .

Five Students: ముగ్గురు పిల్లలు బట్టలు లేకుండా పరుగెత్తారు.. ఏంటా అని గ్రామస్తులు చూసేసరికి షాక్..


ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది . ఎక్కడికక్కడ నిర్ధారణ పరీక్షలు పెంచారు . అవసరమైతే కేసులు ఎక్కువ ఉన్న చోట క్షేత్రస్థాయి లో పరీక్షలు చేస్తూ పాజిటివ్లను గుర్తిస్తున్నారు . లక్షణాలు లేకపోవడంతో .. సెకండ్ వేవ్ ప్రారంభంలో పాజిటివ్ వచ్చినవారికి తీవ్ర జ్వరం , ఒళ్లు నొప్పులు , దగ్గు , జలుబు వంటి లక్షణాలు కనిపించేవి . కానీ , ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకినవారికి ఒకరోజుకు మించి జ్వరం ఉండడం లేదు . మరుసటి రోజు జ్వరం తగ్గేసరికి సాధారణ వైరల్ జ్వరం వచ్చి తగ్గిందనే సాకుతో పరీక్షలకు వెళ్లడం లేదు . దీంతో ఒకరి నుంచి మొత్తం కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదం ఏర్పడుతోంది . ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలతో పాటు ఇటీవల చేపట్టిన ఫీవర్ సర్వే సత్ఫలితాలిస్తున్నాయి .

Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్‌ ఆప్షన్.. వివరాలివే..


" కరోనా ప్రారంభంలో ప్రజలు మాస్కులు , శానిటై జర్లు , భౌతికదూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కొంత మేర అడ్డుకున్నారు . సెకండ్వేవ్ ప్రారంభంలో కూడా నియంత్రణ చర్యలు పాటించగా .. ప్రస్తుతం కరోనా తగ్గిందనే భావనతో ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవడం లేదు . సాధారణ రోజుల మాదిరిగానే వ్యవహరిస్తుండడంతో వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది . ఈనెల 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల్లో 50 పాజిటివ్ కేసులు రావడమే ఇందుకు నిదర్శనం .


Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


ఒక్క ప్రభుత్వాసుపత్రిలోనే 20 మందికి కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతుండగా , ప్రైవేటులో మరో 20 మంది వరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది .జ్వరం , దగ్గు , జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి . ఒకే రోజు జ్వరం వచ్చి తగ్గిందనే నిర్లక్ష్యంగా ఉండకుండా కరోనా టెస్టు చేయించుకొని పాజిటివ్ వస్తే ఐసోలేషన్ లో ఉండాలి . 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకాలు వేసుకొని కరోనా నుంచి రక్షణ పొందలని జిల్లా వైద్య అధికారిని డాక్టర్ జూవేరియా తెలిపారు.

First published:

Tags: Corona, Covid cases

ఉత్తమ కథలు