హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubbagar : అధికారులు, మంత్రులు చెబుతున్నా..జిల్లా ఆసుపత్రుల్లో సౌకర్యాలు సున్నా...

Mahabubbagar : అధికారులు, మంత్రులు చెబుతున్నా..జిల్లా ఆసుపత్రుల్లో సౌకర్యాలు సున్నా...

గాంధీ అసుపత్రి

గాంధీ అసుపత్రి

కరోనా చికిత్సలో రాష్ట్ర అధికారులతో పాటు ముఖ్యమంత్రి,మంత్రులు చెబుతున్న దానికి గ్రౌండ్ లేవల్ పరిస్థితులకు పోంతన లేకుండా పోతుంది. జిల్లా స్థాయిలో సిబ్బంది కొరత రోగులను పట్టి పీడిస్తోంది.

  కరోనా చికిత్సలో రాష్ట్ర అధికారులతో పాటు ముఖ్యమంత్రి,మంత్రులు చెబుతున్న దానికి గ్రౌండ్ లేవల్ పరిస్థితులకు పోంతన లేకుండా పోతుంది. కరోనా చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్రస్థాయిలో చెబుతున్నారు. ఇందుకోసం సీఎం తోపాటు ఉన్నతాధికారులు నిత్యం సమీక్షలు చేస్తున్నట్టు వివరిస్తున్నారు. అయితే జిల్లాల్లో ఇలాంటీ పరిస్థితులు లేవని అర్థం అవుతోంది. జిల్లా స్థాయిలో కొవిడ్ ఆసుపత్రులు ఉన్నా..చికిత్సకు సరిపడా ఎక్విప్‌మెంట్ లేకపోవడం..ఒకవేళ ఎక్విప్‌మెంట్ ఉన్నా సరైన సిబ్బంది లేని సంఘటనలతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

  ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో వెంటిలెటర్ ఉన్నా..దాని ఆపరేటర్ లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. స్వంత జిల్లాల్లో వైద్యం లేకపోవడంతో హైదరాబాద్ వరకు రాలేని రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఒకవేళ వచ్చినా..పైరవీలు..పైసలు లేనిదే..ప్రాణాలు నిలబెట్టుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు...

  తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఇటిక్యాల మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా..కొద్ది రోజులు స్థానికంగా వైద్యం పోందాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికంగా వెంటిలెటర్ ఉన్నప్పటికి దాన్ని ఆపరేట్ చేసే సిబ్బందితో పాటుఅనస్థిషియా వైద్యుడు కూడ లేకపోవడంతో హైదరాబాద్ పంపించినట్టు వైద్యులు తెలిపారు. అయితే పాజిటీవ్ రోగిని హైదరాబాద్ గాంధీకి పంపినా ఫలితం దక్కలేదు.. అక్కడ కూడ బెడ్లు ఖాలీ లేవని వైద్యులు చెప్పారు. ఇక అక్కడ నుండి తిరిగి టిమ్స్‌కు చేరారు. కాని అక్కడ కూడ బెడ్ లభించలేదు..దీంతో స్థానిక ఎమ్మెల్యే క్రిష్ణమోహన్, మంత్రి ఈటల రాజేందర్ తో మాట్లాడితే గాని తిరిగి బెడ్ లభించని పరిస్థితి నెలకొంది. చివరికి మంత్రి పైరవితో గాంధీలో చేర్చుకున్నా...చికిత్స పోందుతూ ..మరణించాడు.

  అయితే సకాలంలో స్థానిక జిల్లా ఆసుపత్రిలో వెంటిలేటర్ ఉన్నట్లయితే తమ తమ్ముడు బతికి ఉండేవాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మరి బంధువుల ఆరోపణలకు, ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పోంతన లేకుండా పోతుంది. కాగా రెండు రోజుల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనస్థిషియా తోపాటు ఇతర సిబ్బంది భర్తి కోసం నోటిఫికేషన్ కూడ వెలువడింది. మరోవైపు ఈటల రాజేందర్ సైతం కావాల్సిన సిబ్బందిని రిక్రూట్ చేసుకుని కరోనా నుండి ప్రజలను కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..మరి రానున్న రోజుల్లోనైనా పరిస్థితి మారుతుందా అనేది వేచి చూడాలి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Corona cases, Mahabubnagar, Telangana

  ఉత్తమ కథలు