Home /News /telangana /

CORONA HITTING HARD TO TRS PARTY NOW ANOTHER TRS MINISTER SINGIREDDY NIRANJAN REDDY DIAGNOSED WITH CORONA POSITIVE PRV

TRS Ministers: టీఆర్​ఎస్​లో కరోనా కలవరం.. తాజాగా మరో మంత్రికి కోవిడ్​ పాజిటివ్​.. ఐసోలేషన్​లో ఉన్నట్లు మంత్రి ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తికొనసాగుతోంది. అయితే ఇపుడు కరోనా బాధితుల్లో అధికంగా అధికార టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు (TRS party leaders) ఉండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో ​ మంత్రికి కరోనా పాజిటివ్​గా (Corona positive to TRS MLA) తేలింది

ఇంకా చదవండి ...
    తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తికొనసాగుతోంది. అయితే ఇపుడు కరోనా బాధితుల్లో అధికంగా అధికార టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు (TRS party leaders) ముఖ్యంగా టీఆర్​ఎస్​ మంత్రులు (TRS Ministers) ఉండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో ​ మంత్రికి కరోనా పాజిటివ్​గా (Corona positive to TRS MLA) తేలింది.  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Agriculture Minister Singireddy Niranjan Reddy)కి కరోనా పాజిటివ్​గా నిర్థారణ అయ్యింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కావున ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    మంత్రి ఎర్రబెల్లికి ఇటీవలె..

    ఇటీవలె ముత్తిరెడ్డి కరోనా (Corona positive) బారినపడ్డారు. అప్పట్లో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం. అప్పుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముత్తిరెడ్డి సతీమణి, గన్‌మెన్, వంటమనిషి, డ్రైవర్‌కు కరోనా సోకింది.  మంత్రులను (TRS Ministers) కరోనా భయపెడుతోంది. మంత్రి ఎర్రబెల్లికి ఇటీవలె కరోనా సోకింది. అసెంబ్లీ స్పీకర్ పోచారం సైతం కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల కిందట ఎంపీ రంజిత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇలా ఒకరి తర్వాత మరొక టీఆర్​ఎస్​ సీనియర్ లీడర్లు కరోనా బారిన పడుతుండటంతో టీఆర్​ఎస్​లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    శరవేగంగా వ్యాపించే ఒమిక్రాన్​ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. దీని స్వభావం రీత్యా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 30 శాతం జనాభాకు వైర్‌స సోకే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఫిబ్రవరిలో పెద్దసంఖ్యలో వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఆస్పత్రులను సంసిద్ధం చేస్తోంది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.

    ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల (Corona cases in Telangana) సంఖ్య 7,47,155 కాగా, మరణాల సంఖ్య 4,078గా ఉంది. తెలంగాణలో రికవరీ కేసుల సంఖ్య 7,05,054 ఉండగా, తాజాగా 2,046 మంది కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 94.37 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 38,023 మంది ఉన్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం మొత్తం 88,867 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,16,78,469 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

    కాగా, కరోనా వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. తెలంగాణలోనే మొదటి సారిగా వందశాతం రెండో డోసును పూర్తి చేసుకున్న జిల్లాగా రికార్డుకెక్కింది. అంతే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్‌ మొదటి స్థానంలో నిలవగా.. కరీంనగర్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ అంత్యంత వేగంగా కొనసాగుతుందనే దానికి వేదిక నిలించింది. ఆ జిల్లా మొత్తం తెలంగాణ జిల్లాల్లో వంద శాతం రెండవ డోసును పూర్తి చేసుకున్న జిల్లాగా రికార్డు కెక్కింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona cases, Corona positive, Telangana, Trs, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు