Home /News /telangana /

CORONA EFFECT IN HYDERABAD COURTS BREAK FOR PHYSICAL TRIALS VS

Hyderabad జంటనగరాల కోర్టులకు కరోనా ఎఫెక్ట్ ... భౌతిక విచారణకు బ్రేక్.

తెలంగాణ హైకోర్టు(:ఫైల్ ‌ఫొటో)

తెలంగాణ హైకోర్టు(:ఫైల్ ‌ఫొటో)

Corona హైదరాబాద్ కోర్టుల్లో భౌతిక విచారణకు బ్రేక్ , కరోనా బారిన పడుతున్న న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది. తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు

కరోనా సెకండ్ వేవ్, పోలీసులు , న్యాయవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో రాష్ట్ర రాజధానిలోని జంటనగరాల కోర్టుల్లో ఉన్న కేసుల భౌతిక విచారణకు మరోసారి బ్రేకులు వేశాయి.  ఇక రోజువారి కేసులను వీడియో కాన్సరెన్స్ ద్వార విచారించనున్నాయి.  రాష్ట్ర్రంలో పెరుగుతున్న  కరోనాకేసుల నేపథ్యంలోనాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి  తుకారాంజీ హైకోర్టుకు లేఖ  రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే వారిని కూడ కరోనా  కబలించడంతో పిర్యాధుదారులు జంకుతున్నారు.  దీంతో నగరంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండే పోలీసులకు కరోనా సోకడంతో న్యాయం కోసం వెళ్లే వారికి విఘాతం ఏర్పడనుంది.


తెలంగాణలో 1500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కూడ విస్తేతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తెలంగాణా వ్యాప్తంగా పదిహేను  వందల మందికి కరోనా పాజిటీవ్ గా నిర్థారణ అయింది.అధిక జనసాంద్రత కల్గిన హైద్రబాద్ లోకూడ దీని ప్రభావం ఎక్కువగానే చూపుతోంది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ప్రభుత్వ సంస్థలు అప్రమత్తమవుతన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు జంటనగరాల్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ,సిటి సివిల్ కోర్టు తోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలోఉన్న సిబ్బంది మరియు న్యాయవాదులకు కరోనా సోకింది. దీంతో విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు సెషన్స్ర్టు న్యాయమూర్తి హైకోర్టు లేఖ రాశారు. దీంతో హైకోర్టు స్పందించి ఆదేశాలను జారీ చేసింది.

ముఖ్యమైన కేసులే వీడియో కాన్షరెన్స్ ద్వార

ఈ నేపథ్యంలోనే గత సంవత్సరలో ఉన్న కరోనా నిబంధలనే అమలు చేయాలని పేర్కోంది. బౌతిక విచారణలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. కేసులను వీడియో కాన్షరెన్స్ ద్వార విచారించాలని
స్పష్టం చేసింది. ముఖ్యమైన కేసులను మాత్రమే వీడియో కాన్సరెన్స్ ద్వార విచారించాలని  తెలిపింది.మరోవైపు కక్షిదారులు కోర్టుకు హజరు కాలేకపోయిన వారికి ప్రతికూల ఆదేశాలు జారీ
చేయవద్దని సూచించింది.

పోలీసుల్లో అలజడి 

ఇక కరోనా కట్టడికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న నగర పోలసులను సైతం కరోనా వెంటాడుతోంది. ఈ నేపత్యంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసు సిబ్బందికి 10 మందికి పైగా కరోనా పాజీటివ్ లక్షణాలు ఉన్నాయి. దీంతో నగర వ్యాప్తంగా 100 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డంటూ అధికారులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తగిన చర్యలు తీసుకోవాలని , వెంటనే వారు సెలవు తీసుకోవాలని సూచించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్ట్ లను కూడ నిలిపివేయాలని భావిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Hyderabad, Hyderabad police, Telangana High Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు