Home /News /telangana /

CORONA DEAD BODY WAS CHANGED IN NIZAMABAD FOR SECOND TIME VRY NZB

Corona dead body change : గాలమణిగా మారిన గంగామణి.. రెండోసారి కరోనా శవాలు తారుమారు.. నిజామాబాద్‌లో ఇంతేనా...

గాలమణిగా మారిన గంగామణి..  రెండోసారి కరోనా శవాలు తారుమారు..

గాలమణిగా మారిన గంగామణి.. రెండోసారి కరోనా శవాలు తారుమారు..

Nizamabad : మ‌రోసారి క‌రోనా శ‌వాలు తారుమారు..ఖ‌న‌నం చేసే ముందు చివ‌రి చూపు చూసి కంగుతిన్న కుటుంబ‌స‌భ్యులు.. మది కాని శవాన్ని ఖననం చేసిన వైనం...ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్న గ్రామస్థులు

నిజామాబాద్ జిల్లా,
న్యూస్18ప్ర‌తినిదిః పి.మ‌హేంద‌ర్,

.నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ కు చెందిన గాలమని (65) గత వారం రోజులుగా జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని కోవిడ్ వార్డులో చికిత్స పొందుతుంది..అయితే ఆమె పరిస్థితి విషమించి మంగళవారం ఉద‌యం మృతి చెందింది.. దీంతో గాల‌మని మృతదేహాన్ని ప్యాక్ చేసి పోస్టుమార్టానికి తరలించారు..పోస్టుమార్టం నుండి.. గాల‌మ‌ని మృత‌ధేహ‌న్ని కుటుంబ స‌భ్యులకు అప్పగించారు..మొత్తం శవానికి ముసుగు ఉండడంతో అప్పుడు శవాన్ని చూడలేక పోయారు..అనంతరం ఆసుపత్రి నుండి ఆంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు తీసుకు వెళ్లారు.. అయితే మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో కుటుంబ సభ్యులు చివరి చూసేందుకు పీపీఈ కిట్ ముసుగు తీశారు..దీంతో ఆ శవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు..

తాము ఖననం చేయబోయో మృత దేహం గాలమని కాదని గుర్తించి ,ఖననం చేయకుండా ఆపారు..అనంతరం గాలమని మృతదేహం కోసం ఆరా తీసారు.. అయితే వ‌ర్ని మండ‌లం జ‌లాల్ పూర్ గ్రామానికి చెందిన గంగామణి మృతదేహం బదులు గాలమని మృతదేహం అప్ప‌గించారు.. దీంతో గంగామ‌ణి కుటుంబ‌స‌భ్యులు క‌ర్మ‌ఖండాలు పూర్తి చేసార‌ని తెలియడంతో ఆవేదనకు గురయ్యారు..అయితే తిరిగి గాలమ‌ని మృతదేహం తీసుకువచ్చి ఆస్పత్రిలో అప్పగించారు.. దీంతో గంగామణి కుటుంభ సభ్యులు మరోసారి అంత్యక్రియలు నిర్వహించారు.

గ‌త రెండు నెల‌ల్లో రెండోసారి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు తారుమార‌య్యాయి.. గత రెండు నెలల క్రితం గాయత్రి నగర్ కు చెందిన నర్సుబాయి మృతి చెందింది.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారు.. దీంతో నర్సుబాయి కుటుంబీకులు మైనారిటీ మహిళ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు.. ఈ విషయాన్ని గుర్తించిన మైనార్టీ కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది పై మండిపడ్డారు.. తాజాగా మరోసారి ఈ ఘటన పునరావృతం అయింది.. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై బాదితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Published by:yveerash yveerash
First published:

Tags: Corona dead bodies, Nizamabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు