రాష్ట్రంలో కరోనా కేసుల ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో జ్వర సర్వే ఓ వైపు కోనసాగుతుండగా మరోవైపు కరోనా పాజీటివ్ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల్లో 4416 కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఇద్దరు కరోనా రోగులు మృతి చెందినట్టు తెలిపింది. ఇక తెలంగాణలో మొత్తం 7,26,819 కరోనా కేసులు నమోదు కాగా 4000 వేలకు పైగా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే వేల సంఖ్యలో పాజిటీవ్ కేసుల సంఖ్య నమోదవుతుంది.
ఇక హైదరాబాద్లో ఫేక్ RTPCR మరియు కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ పంపిణి చేస్తున్న ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ముఠా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్స్ ఇస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణల కోసం ఈ ముఠా నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ కూడా విక్రయిస్తున్నారు. ఇలా దందా కొనసాగిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి 50 కోవిడ్ సర్టిఫికెట్స్, ఇతర ఆర్టీపీసీఆర్ కిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona alert, Hyderabad, Telangana