CORONA CASES RAISED VERY HIGH IN GREATER HYDERABAD AREA ESPECIALLY 60 PERCENT OF TELANGANA CASES CAME FROM GHMC ONLY PRV
Telangana Corona cases: గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా రాజధానిలోనే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో (Corona cases in Telangana) 60 శాతంపైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లో కరోనా కోరలు చాస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో (Corona cases in Telangana) 60 శాతంపైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ మొదటి, రెండో వేవ్‌లలో సరైన చికిత్స (Treatment) అందక వేలమంది మరణించారు. వైరస్ బారిన పడిన వందలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. శనివారం సాయంత్రం వరకు గ్రేటర్లో 2089 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 1583, రంగారెడ్డి జిల్లాలో 214, మేడ్చల్ జిల్లాలో 292 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,606 కరోనా కేసులు (Corona cases in Telangana) నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో వెల్లడించింది.
రాష్ట్రంలో లాక్ డౌన్ (Lockdown) విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు ముఖ్యమంటూ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి చివర్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని తెలిపారు. దేశంలో కూడా థర్డ్ వేవ్ (Third wave) మొదలైందంటూ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నిన్న ఒక్కరోజే లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్టాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్లు పేర్కొన్నారు.
పెద్దసంఖ్యలో కేసులోస్తే..
తెలంగాణలో వ్యాక్సినేషన్ (Vaccination in Telangana) చాలా మంది తీసుకున్నారు. దీంతో థర్డ్ వేవ్‌లో ఆస్పత్రుల పాలయ్యేవారు తక్కువగా ఉంటారని అనుకుంటున్నారు. కానీ, పెద్దసంఖ్యలో కేసులోస్తే కష్టమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సంబరంగా జరుపుకొనే సంక్రాంతి ముంగిట.. కరోనా ముప్పు కలవరపరుస్తోంది. పండుగకు నగరం నుంచి ఊరెళ్లనున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదం ఉరుముతోంది. వీరి నుంచి గ్రామాలకూ పాకుతుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల మంది వెళ్లి, రానున్న నేపథ్యంలో పరిస్థితి ఎక్కడకు దారితీస్తుందోనని తీవ్ర ఆందోళన రేగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.