తెలంగాణ (Telangana)లో రోజురోజుకు కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,606 కరోనా కేసులు (Corona cases in Telangana) నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 1583, మేడ్చల్ 292, రంగారెడ్డిలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కరోనాతో ఈ రోజు ఇద్దరు మృతి (Died) చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో (Corona cases in Telangana) 60 శాతంపైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ మొదటి, రెండో వేవ్‌లలో సరైన చికిత్స అందక వేలమంది మరణించారు.
ఆక్సిజన్ కొరత లేకుండా..
కరోనా తీవత్ర నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే థర్డ్‌వేవ్ (Third wave) వచ్చేసినట్లే అని అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అధికారులు బెడ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆసుపత్రులతో చేరిన వారిలో దగ్గు, జ్వరం (fever) లాంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. దాదాపు కోటి వరకు హోమ్ ఐసోలేషన్ కిట్‌లను కూడా పంపిణికి సిద్ధం చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి మరోసారి ఫీవర్ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.
సంక్రాంతి ముంగిట...
తెలంగాణలో వ్యాక్సినేషన్ చాలా మంది తీసుకున్నారు. దీంతో థర్డ్ వేవ్‌లో ఆస్పత్రుల పాలయ్యేవారు తక్కువగా ఉంటారని అనుకుంటున్నారు. కానీ, పెద్దసంఖ్యలో కేసులోస్తే కష్టమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సంబరంగా జరుపుకొనే సంక్రాంతి ముంగిట.. కరోనా ముప్పు కలవరపరుస్తోంది. పండుగకు నగరం నుంచి ఊరెళ్లనున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదం ఉరుముతోంది. వీరి నుంచి గ్రామాలకూ పాకుతుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల మంది వెళ్లి, రానున్న నేపథ్యంలో పరిస్థితి ఎక్కడకు దారితీస్తుందోనని తీవ్ర ఆందోళన రేగుతోంది.
కాగా, తెలంగాణ (Telangana)లో లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు కొవిడ్ మూడో వేవ్ కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నైట్ కర్ఫ్యూగానీ, లాక్ డౌన్ అసలే ఉండబోవని ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు కుండ బద్దలుకొట్టారు. జనవరి చివర్లో లాక్ డౌన్ ఉండొచ్చనే ప్రచారాన్ని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇప్పటికే కొట్టి పారేశారు.
కాగా, సెంటర్ ఫర్ నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్, IISc-ISI, బెంగళూరు బృందం చేసిన సర్వే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఇక జనవరి మూడో వారంలో కోవిడ్ ప్రభావం తెలంగాణలో ఫీక్స్ లో ఉంటుందని అంచన వేస్తోన్నారు. కోవిడ్ వేవ్ జనవరి మూడో వారం నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంటుందనే అంచనాలు వేస్తున్నారు. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు (covid positive cases) 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు చేరే అవకాశం ఉందని తమ నివేదికలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.