CORONA CASES ARE BEING REGISTERED HEAVILY IN TELANGANA AND MORE THAN HALF OF THE CASES WERE REPORTED IN GHMC ALONE PRV
corona cases in Telangana: ఆ ప్రాంతంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగం అక్కడివే....
ప్రతీకాత్మక చిత్రం
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గతవారం నుంచి ప్రతిరోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.
తెలంగాణలో కరోనా (Corona) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గతవారం నుంచి ప్రతిరోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో కరోనా కేసులు (Corona cases in Telangana) భారీగా పెరిగాయి. నిన్న వెయ్యి దాటిన కేసులు ఇవాళ రెండు వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా టెస్టులు చేయగా 1,913 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 1,214 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,036కు చేరింది. కరోనా నుంచి మంగళవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 ఐసోలేషన్, యాక్టివ్ కేసులు (Active cases) ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
కరోనా తీవత్ర నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే థర్డ్‌వేవ్ (Third wave) వచ్చేసినట్లే అని అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అధికారులు బెడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆసుపత్రులతో చేరిన వారిలో దగ్గు, జ్వరం (fever) లాంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. దాదాపు కోటి వరకు హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా పంపిణికి సిద్ధం చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి మరోసారి ఫీవర్ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.
నైట్ కర్ఫ్యూగానీ, లాక్ డౌన్ అసలే ఉండబోవని..
కాగా, తెలంగాణ (Telangana)లో లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు కొవిడ్ మూడో వేవ్ కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నైట్ కర్ఫ్యూగానీ, లాక్ డౌన్ అసలే ఉండబోవని ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు కుండ బద్దలుకొట్టారు. జనవరి చివర్లో లాక్ డౌన్ ఉండొచ్చనే ప్రచారాన్ని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇప్పటికే కొట్టి పారేశారు.
కాగా, సెంటర్ ఫర్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్, IISc-ISI, బెంగళూరు బృందం చేసిన సర్వే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఇక జనవరి మూడో వారంలో కోవిడ్ ప్రభావం తెలంగాణలో ఫీక్స్ లో ఉంటుందని అంచన వేస్తోన్నారు. కోవిడ్ వేవ్ జనవరి మూడో వారం నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంటుందనే అంచనాలు వేస్తున్నారు. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు (covid positive cases) 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు చేరే అవకాశం ఉందని తమ నివేదికలో తెలిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.