Home /News /telangana /

CORONA BULLETIN 2000 POSITIVE CASES YESTERDAY ITSELF RECORDED VS

corona bulletin తెలంగాణలో ఒక్కరోజే 2000 పాజీటివ్ కేసులు. జీహెచ్ఎంసీ పరిధిలో 393

corona bulletin

corona bulletin

corona update తెలంగాణలో ఒక్కరోజే 2000 పాజీటివ్ కేసులు. జీహెచ్ఎంసీ పరిధిలో 393 కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు సీరియస్ తో వైద్యాధికారుల ఉన్నతస్థాయి సమావేశం

దేశ వ్యాప్తంగా వి

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా,  రాష్ట్ర్రంలో కూడ తన ప్రతాపాన్ని చూపిస్తోంది..తాజాగా నిన్న ఒక్కరోజే కరోనా పాజీటీవ్ కేసుల  సంఖ్య రెండువేలకు చేరింది.  గడిచిన ఇరవైనాలుగు గంటల్లో మొత్తం 74275 మంది కరోనా టెస్టులు చేయించుకోగా 1914 కేసులు పాజిటీవ్ గా నమోదు అయ్యాయి. మంగళవారం నాడు కరోనాతో 5 మరణాలు సంభవించాయని, దీంతోపాటు 11వేలకు పైగా ఆక్టివ్ కేసులు అక్టీవ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్యశాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1734కు చేరింది. మంగళవారం నమోదైన కేసుల్లో 393 జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, 205 మేడ్చల్ జిల్లాలో, 179 కేసులు నిజామాబాద్ , 169 రంగారెడ్డి, 104 పాజిటివ్ కేసులు నిర్మల్
జిల్లాలో నమోదు అయినట్టు వెల్లడించింది.

మరోవైపు రాష్ట్ర హైకోర్టు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సీరియస్ కావడంతో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ  పరంగా తీసుకోవాల్సిన చర్యలు , వాటి అమలు తీరుతో పాటు భవిష్యత్ ప్రణాళికపై  చర్చించేందుకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మరోైవైపు పోలీసులు సైతం నేటి నుండి రంగంలోకి దిగనున్నారు. మాస్కులు వేసుకోవడంపై గత నాలుగు రోజులుగా ప్రచారం కల్పించిన వారు, నేడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించనున్నారు. మాస్కులు వేసుకోకుండా బయట తిరిగి వారిపై కేసులు నమోదు చేసి నేరుగా కోర్టుకు తరలించేందుకు సన్నద్దమయ్యారు.

కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టింది. కరొనా కట్టడికి ముందు జాగ్రత్త చర్యలు మేలని భావించింది. దీంతో మాస్కులు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఝప్తి చేసింది. ఈ నేపధ్యంలోనే మాస్కులు పెట్టుకుంటారా, లేదంటే లాక్ డౌన్ విధించమంటారా అంటూ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రజలను ప్రశ్నించారు.. మాస్కులు   పెట్టుకోకుంటే లాక్ డౌన్ తప్పదంటూ ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి పోలీసుల హెచ్చరికల ద్వార కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్దమయింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, High Court, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు