Home /News /telangana /

CORONA AWARENESS CAMPAIGN OF LITRON SYSTEM BY A STUDENT IN HYDERABAD VRY HYD

Hyderabad : కోవిడ్ కట్టడికి వినూత్న ప్రచారం.. సూప‌ర్ హిరోలా మారిన ఇంజినీరింగ్ స్టూడెంట్!

కోవిడ్ వ్యాప్తికి కట్టడికి వినూత్న ప్రచారం.. సూప‌ర్ హిరోలా మారిన ఇంజినీరింగ్ స్టూడెంట్!

కోవిడ్ వ్యాప్తికి కట్టడికి వినూత్న ప్రచారం.. సూప‌ర్ హిరోలా మారిన ఇంజినీరింగ్ స్టూడెంట్!

Hyderabad : కరోనాను ఎదుర్కొనేందుకు ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు..ఓవైపు కరోనా కట్టడికి ప్రభుత్వ వర్గాలు తమ వంతు సహాయం చేస్తుండగా వ్యక్తిగతంగా చాలమంది ప్రముఖులు కూడ ముందుకు వస్తున్నారు..ఇలా సమాజానికి కష్టకాలంలో ఆదుకోవాలనే ధోరణితో ఇటివల విద్యార్థులు కూడ కరోనా కట్టడిలో పాలు పంచుకుంటూ ప్రశంసలు పొందుతున్నారు..

ఇంకా చదవండి ...
కోవిడ్ మ‌హ‌మ్మారి దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న వేళ వైధ్యులు, ప్ర‌భుత్వాలు, పోలీస్ సిబ్బంది కోవిడ్ క‌ట్ట‌డ‌కి రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతుంటే మ‌రో వైపు కొంత మంది యువ‌త త‌మ‌కు చేత‌నైన స్థాయిలో ఈ క‌ష్ట‌కాలంలో అండగా నిలుస్తోన్నారు. స‌రిగ్గా అలాంటి కోవకే చెందుతాడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన చింత‌ప‌ల్లి రాకేష్... తాను నేర్చుకున్న విద్య‌తోనే ఈ క‌ష్ట స‌మ‌యంలో త‌న వంతు సాయం అందిస్తోన్నాడు. చ‌దువుకున్న‌ది ఇంజీనీరింగ్ అవడంతో త‌న‌కు వ‌చ్చిన విధ్య‌తోనే కోవిడ్ పై అవ‌గాహాన క‌ల్పిస్తోన్నాడు.

ఇందులో భాగంగానే కోవిడ్ వ్యాప్తి అరిక‌ట్ట‌డ‌మే ధ్యేయంగా లైట్రాన్ అనే సూప‌ర్ హిరోను తేర‌పైకి తీసుకొచ్చాడు. తానే సొంతగా ఒక సూప‌ర్ హీరో సూట్ రెడీ చేసుకొని దాన్ని లైట్ల‌తో ఆక‌ట్టుకునే విధంగా రూపోందించి కోవిడ్ పై అవ‌గాహాన పెంచుతున్నాడు. విశాఖ గీతం లో మెకానీక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాకేష్ కొంత కాలం బెంగ‌ళూరు లో విప్రోలో కొంత కాలం ఉద్యోగం చేశాడు. త‌రువాత హైద‌రాబాద్ వ‌చ్చి బైక్ మెకానిక్ రంగంలో ఎన్ని కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టాడు. అయితే ప్ర‌స్తుతం కోవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో త‌న వంతు సాహాయం చేయ‌డానికి ఎదైన చేయాల‌ని ఈ లైట్రాన్ అనే ఐడియాకి శ్రీకారం చూట్టాడు.

ప్రజల్లో అవగాహన కోసం న‌గ‌వ్యాప్తంగా దాదాపు నెల రోజుల‌పాటు లైట్రాన్ ప్ర‌ద‌ర్శ‌నల ద్వారా కోవిడ్ పై అవ‌గాహాన క‌ల్పించాడు. అయితే ఈ ప్ర‌ద‌ర్శ‌తో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమికూడ‌డం సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌క‌పోవ‌డం వంటివి గ‌మ‌నించిన త‌రువాత వీడియోల ద్వారా య్యూటూబ్ నుంచి అవ‌గాహాన పెంచ‌డం ప్రారంభించాడు. అలా గ‌త రెండు నెల‌ల నుండి త‌న వంతుగా కృషి చేస్తున్నాడు రాకేష్.

ముఖ్యంగా ప్ర‌భుత్వాలు ప‌దే ప‌దే చెబుతున్నప్ప‌టికి ఎవ‌రు కూడా సోష‌ల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కరోనా ఉదృతి పెరుగుతోంది. ఇలా నిబంధనలు పాటించకపోవడం వల్లే సెకండ్ వేవ్‌లో ప్రజల ప్రాణాలు పోగొట్టుకుంటున్న తరుణంలోనే అవ‌గాహానే ముఖ్యమనే ఆలోచనతో దీనికి శ్రీకారం చుట్టినట్టు ఆ విద్యార్ది తెలిపాడు. కాగా సాధార‌ణంగా చెబితే ఎవ‌రు ప‌ట్టించుకోరు కాబ‌ట్టి ఎదైన కొత్త విధానంలో చెబితే మ‌నం చెప్పేది వింటార‌నే ఉద్దేశ్యంతో ఈ సూప‌ర్ హిరో క‌న్సెఫ్ట్ ను తెర‌పైకి తీసుకోచ్చాను అని న్యూస్ 18 కి తెలిపారు.

అయితే ఇందుకోసం తాను 2007 లో ఒక ప్రాజెక్ట్ కోసం రూపోందించుకున్న సూట్‌నే మ‌ళ్లి రీ డిజైన్ చేసి దాని ద్వార ప్ర‌జ‌ల్లో కోవిడ్ పై చైత‌న్యం కల్పిస్తున్నట్టు తెలిపాడు.. త‌న‌కు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పిస్తే మ‌రెన్నో అవ‌గాహాన కార్య‌క్ర‌మాలు చేస్తోన్నాను అంటున్నాడు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona alert, Hyderabad, Telangana

తదుపరి వార్తలు