తెలంగాణలో ప్రారంభమైన సహకార సంఘాల ఎన్నికలు... ఇవీ విశేషాలు...

Telangana Cooperative Elections : తెలంగాణలో ఈమధ్యే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు సహకార ఎన్నికలు కూడా విజయవంతంగా ముగించాలనుకుంటున్నారు అధికారులు.

news18-telugu
Updated: February 15, 2020, 7:08 AM IST
తెలంగాణలో ప్రారంభమైన సహకార సంఘాల ఎన్నికలు... ఇవీ విశేషాలు...
తెలంగాణలో ప్రారంభమైన సహకార సంఘాల ఎన్నికలు... ఇవీ విశేషాలు...
  • Share this:
Telangana Cooperative Elections 2020 : తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్ని 2018లో ముందుగానే జరిపించేసిన సీఎం కేసీఆర్... ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను కూడా వేగంగా జరిపించేశారు. ఇప్పుడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలు మొదలయ్యాయి. ఉదయం 7కు మొదలైన ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. ఆ తర్వాత భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. సాయంత్రం ఫలితాలు విడుదలవుతాయి. మూడు చోట్ల తప్ప మిగతా 906 సహకార సంఘాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటు హక్కున్నవారంతా ఓటు వెయ్యాలనీ... మిస్ అవ్వొద్దని అధికారులు కోరారు. 1 గంట తర్వాత ఓటు వేసే ఛాన్స్ లేదు కాబట్టి... ఎన్ని పనులున్నా పక్కన పెట్టి... ఈ పని పూర్తి చేసుకోమని సూచిస్తున్నారు. ఐతే... ఇక్కడో కండీషన్ ఉంది. ఓటు వేయాలనుకునేవారు... సహకారం సంఘం ఇచ్చిన ఫొటో ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అది చూపిస్తే ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు.

తెలంగాణలోని 747 PACSల పరిధిలో 6248 మంది డైరెక్టర్‌ పోస్టులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యాలెట్‌ పేపర్‌ బాక్సుల ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 747 మంది గెజిటెడ్‌ అధికారుల్ని ఎన్నికల అధికారులుగా నియమించారు. అలాగే 20 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్‌ పత్రాలు రెడీగా ఉన్నాయి. దాదాపు 12 లక్షల మంది ఓటు వేస్తారని తెలిసింది. ఫలితాల ప్రకారం... మూడు రోజుల్లో పాలకవర్గాల నియామకాలు ఉంటాయి. ఈ ఎన్నికలు, నియామకాల్లో ఏవైనా అభ్యంతరాలు వస్తే... కో-ఆపరేటివ్‌ చట్టాల ప్రకారం అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు