• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CONTINUOUS MONITORING OF KOVID SERVICES THANK YOU TO THE MEDICAL STAFF BY MINISTER VEMULA PRASHANTH REDDY VB NZB

Minister Prashanth reddy: కోవిడ్ సేవలపై నిరంతర పర్యవేక్షణ.. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు..

Minister Prashanth reddy: కోవిడ్ సేవలపై నిరంతర పర్యవేక్షణ.. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితర అధికారులు

Nizamabad: ఊహించకుండానే కరోనా విరుచుకుపడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తుంది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి  మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సేవలను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

  • Share this:
    (పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18తెలుగు)

    నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి మంత్రి వేముల సందర్శించారు. కోవిడ్ పేషెంట్లను ఆత్మీయంగా పలకరిస్తూ మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళతారని మనోధైర్యాన్ని నింపారు. మీరందరిని క‌లిసి రమ్మని ముఖ్యమంత్రి నన్ను పంపారని ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా అందించారు. ఆసుప‌త్రిలో కోవిడ్ పేషెంట్ల‌కు అందుతున్న సేవల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వేముల‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సోకిన మన దగ్గర బంధువుల దగ్గరికి వెళ్లడానికే మనం భయపడతాము.. కానీ నర్సింగ్, శానిటేషన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ లు, డాక్టర్లు, ఏఎన్ఎంలు 24 గంటలు పనిచేస్తూ వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సుమారు 400 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు.. వారందారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఒత్తిడిలో కూడా సొంత వ్యక్తుల కంటే బాగా కమిట్మెంట్తో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

    కలెక్టర్ తో తాను ప్రతి రోజు కరోనా పేషెంట్లకు సమకూర్చే సదుపాయాలు, సేవలపై చర్చించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. పేషెంట్లు వారి బంధువులు సామరస్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం 100% శక్తిమేర పేషెంట్లను ఈ వైరస్ నుండి కాపాడడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో మరిన్ని వెంటిలేటర్ లకు చర్యలు తీసుకుంటామన్నారు.

    ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న మంత్రి


    అంతేకాకుండా అవసరమైతేనే బయటకు రావాలని.. అనవసరంగా బయట తిరిగి కోవిడ్ బారిన పడొద్దని మంత్రి ప్రజలకు సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని.. లాక్ డౌన్ ను అందరూ పాటించాలని అన్నారు.
    Published by:Veera Babu
    First published: