హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : మరోసారి టాలీవుడ్ డ్రగ్ కేసు.. సీఎస్‌కు కోర్టు ధిక్కారణ నోటిసులు

Hyderabad : మరోసారి టాలీవుడ్ డ్రగ్ కేసు.. సీఎస్‌కు కోర్టు ధిక్కారణ నోటిసులు

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

Hyderabad : తెలంగాణలో సంచలనం ‌సృష్టించిన టాలివుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణకు సంబంధించి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు రాష్ట్ర ఎక్సైజ్ డైరక్టర్ సర్పరాజ్ అహ్మద్‌‌తో పాటు పలు సంస్థలపై ఈడీ కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను హైకోర్టులో ఫైల్ చేసింది.

ఇంకా చదవండి ...

టాలీవుడ్ డ్రగ్ కేసును విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్ డైరక్టరేట్ కు తెలంగాణ అధికారులతో పాటు

పలు సంస్థలు సైతం సహకరించడం లేదనే అరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈడీ రాష్ట్ర

ఎక్సైజ్ శాఖకు షాకిచ్చింది. నిందితులతో పాటు సాక్షుల డాటా ఈడీకి ఇవ్వాలంటూ ఫిబ్రవరి 2న రాష్ట్ర

హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఈడీ సైతం ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది.. అయితే

ఇప్పటివరకు అందుకు సంబంధించి ఎలాంటీ సమాచారం ఇవ్వకపోవడంతో పాటు కనీసం ఈడీ రాసిన

లేఖకు కూడా సమాధానం రాలేదు. దీంతో తమకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పాటు కోర్టు

ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోలేదని కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను ఫైల్ చేసింది. దీంతో సీఎస్ సోమేష్

కుమార్ తోపాటు ఎక్సైజ్ శాఖ డైరక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై కోర్టు దిక్కారణ నోటిసులు పంపించింది.

కాగా 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టాలీవుడ్ కు సంబంధించిన

ప్రముఖలు డ్రగ్స్ దందాలో ఉన్నారని డగ్స్ పెడ్లర్‌‌తో వారికి సంబంధాలు ఉన్నాయని కేసులు నమోదు

చేసింది. అయితే కేసును రాష్ట్ర విచారణ సంస్థలు పూర్తిగా క్లోజ్ చేశారు. కాని ఇందుకు సంబంధించి కేంద్ర

ప్రభుత్వ సంస్థలైన ఈడీకి అప్పగించాలని ఎంపీ రేవంత్ రెడ్డి పిల్ వేశారు. ఈ క్రమంలో రికార్డులను

ఇప్పించాలంటూ ఈడీ సైతం మధ్యంతర పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఇందుకు సంబంధించి కాల్

రికార్డులతో పాటు ఇతర డిజిటల్ లావాదేవీలకు సంబంధించి రికార్డులను ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వంతో

పాటు ఎక్సైజ్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాని ఈ కేసులో పురోగతి లేఖపోవడంతో ఈడీ

యాక్షన్‌లోకి దిగింది.

Telanagana : ఢిల్లీలో ధాన్యం.. గల్లీలో గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ పోరు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

కాగా ఇటివల కూడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేసుకు

సంబంధించి ఆరా తీశారు. దీంతో ఈడీ సైతం రంగంలోకి దిగింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఓవైపు

రాష్ట్రానికి చెందిన పలు సంస్థలపై ఐటి దాడులు జరుగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మూసివేసిన కేసులో

కేంద్ర సంస్థ దూకుడు రెండు ప్రభుత్వాల మధ్య మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించనుట్టు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Tollywood drug case

ఉత్తమ కథలు