CONSTABLE HELD FOR RAPING WOMAN CONSTABLE WHO WORKING IN CYBERABAD LIMITS VRY
Constable remand : మహిళా కానిస్టేబుల్‌తో క్లోజ్.. రెండు సార్లు గర్భం చేసి.. ఆ తర్వాత..!
constable rape
Constable remand : తనతో పాటు ఉద్యోగం చేసే ఓ మహిళా కానిస్టేబుల్ ను మరో కానిస్టేబుల్ నమ్మించి మోసం చేశాడు. మాయమాటలతో చెప్పి పెళ్లి చేసుకుంటానని రెండు సార్లు గర్భం చేశాడు.
సైబరాబాద్ సర్కిల్స్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్‌ను మాయమాటలు చెప్పి నమ్మించాడు. తనతో కలిసి పని చేస్తుండడంతో తనకు అవసరం వచ్చినప్పుడల్లా లైంగికంగా వాడుకున్నాడు. మరోవైపు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో నమ్మిన ఆ మహిళా కానిస్టేబుల్ సర్వస్వం అప్పగించింది. తీరా రెండు సార్లు గర్భం దాల్చినా కూడా పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన ఘటన అమనగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న 2019 బ్యాచ్ కానిస్టేబుల్ నాగేశ్వర్ రావు (25) మరియు మహిళ ఒకే బ్యాచ్‌కు చెందినవారు మరియు ఇంతకుముందు ఒకే పోలీస్ స్టేషన్‌లో కలిసి పనిచేశారు.ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్తా సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ నాగేశ్వర్ రావు ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
దీంతో ఆమెతో అవసరమైనప్పుడల్లా లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే మహిళా కానిస్టేబుల్ గర్భం దాల్చింది. అయితే కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో మరోసారి గర్భం దాల్చింది. కాని రెండవ సారి కూడా పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నా నిరాకరించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ మోసపోయానని గ్రహించి అమనగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఆ కానిస్టేబుల్ ను తరలించినట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.