హోమ్ /వార్తలు /తెలంగాణ /

Conocarpus: రోడ్లకు ఇరువైపులా ఈ చెట్లే.. కానీ వీటి పూలు మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

Conocarpus: రోడ్లకు ఇరువైపులా ఈ చెట్లే.. కానీ వీటి పూలు మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

కోనోకార్పస్ మొక్కలు

కోనోకార్పస్ మొక్కలు

Conocarpus Trees: కోనోకార్పస్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. హరితహారంలో ఈ మొక్కలను నాటకూడదని అధికారులకు ఆదేశిలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు

వర్షాకాలంలో చాలా మంది మొక్కలు నాటుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హరిత హారం (Haritha Haram) పేరుతో మొక్కల నాటే కార్యక్రమం ఏటా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించి.. అడవుల శాతాన్ని పెంచాలని కంకణం కట్టుకుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తోంది. ఊరూరా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పూలు, పండ్లతో పాటు కలపనిచ్చే చెట్లను రోడ్లకు ఇరువైపులా నాటుతోంది. చెట్ల వల్ల పర్యవరణానికి, మనవాళికి లాభాలే తప్ప నష్టాలూ ఉండవు. ఐతే ఓ మొక్క మాత్రం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అదే కోనోకార్పస్ (Conocarpus).

ika virus: తెలంగాణలో జికా వైరస్ కలకలం​.. వైద్యశాఖ అప్రమత్తం.. పూర్తి వివరాలివే

తెలంగాణ (Telangana)లో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం కోనోకార్పస్ మొక్కలను నాటుతున్నారు. రోడ్ల మధ్య పచ్చదనాన్ని పెంచేందుకు ఈ చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి తక్కువ సమయంలోనే నిటారుగా..ఏపుగా పెరుగుతాయి. రోడ్లకు ఇరువైపుల, రోడ్ల మధ్యలో నాటడం వల్ల పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అందుకే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కోనోకార్పస్ మొక్కలను పెంచుతున్నాయి. కానీ ఈ మొక్కల పట్ల పర్యావరణ ప్రేమికుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అడవులను నరికి వేస్తే పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతారు. కానీ ఇప్పుడు కోనోకార్పస్ మొక్కలను చూస్తే హడలిపోతున్నారు. ఎందుకంటే.. ఇవి అంత డేంజర్ మరి..! వీటి వల పర్యావరణానికి మేలు జరగకపోవగా.. హాని కలుగుతోంది.

కోనోకార్పస్‌ పువ్వుల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. వీటి వేర్లు కూడా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వేర్లు భూమి లోతుకు పాతుకుపోయి.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్‌ కేబుల్స్, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి. కోనోకార్పస్ పుప్పొడిపై సీతాకోకచిలుకలు కూడా వాలవు. మేకలు కూడా దీని ఆకులను తినవు. కీటకాలకు, పక్షులకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. వీటిపై పక్షులు గూళ్లు కట్టవు.మొత్తంగా ఈ చెట్టు వల్ల పర్యావరణానికి ఏ రకంగానూ మేలు జరగదు. కానీ అనేక దుష్ప్రభావాలు కలగజేస్తోంది.


చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల కాయిన్.. అసలేం జరిగిందంటే.

కోనోకార్పస్‌ మొక్కలో అనేక ఉపజాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లో ఇవి పెరుగుతాయి. బలమైన ప్రవాహాలను కూడా తట్టుకునేందుకు వీలుగా.... వీటి వేర్లు బురదనేలల్లోకి అనేక మీటర్ల లోతుకు వెళ్తాయి. తద్వారా చెట్టుకు స్థిరత్వమిస్తాయి. ఫలితంగా తీర ప్రాంతాల్లో నదులు, సముద్రాలు కలిసే చోట... నీటి ప్రవాహాల వేగాన్ని అడ్డుకుంటాయి. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని పట్టణాలు, నగరాల్లో సుందరీకరణకు వినియోగిస్తున్నారు. అనేక పరిశోధనలు చేసిన అనంతరం... పాకిస్తాన్, ఇరాన్‌ వంటి దేశాలు ఈ మొక్కను నిషేధించాలని నిర్ణయించాయి. కోనోకార్పస్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. హరితహారంలో ఈ మొక్కలను నాటకూడదని అధికారులకు ఆదేశిలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. చాలా చోట్ల ఇంకా ఈ మొక్కలను నాటుతున్నారు. ఈ క్రమంలోనే కోనోకార్పస్ మొక్కలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనోకార్పస్ మొక్కలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Haritha haram, Monsoon, Telangana

ఉత్తమ కథలు