V Hanumantha Rao: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్.. పూర్తి వివరాలు ఇవే..

వి.హనుమంతరావు(ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు (V Hanumantha Rao)అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

  • Share this:
    కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు (V Hanumantha Rao)అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఆయన హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇక, కొంతకాలంగా వీహెచ్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న వీహెచ్ సన్నిహితులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.

    ఇక, వి హనుమంతరావు గతేడాది కరోనా వైరస్‌ను జయించిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో గతేడాది జూన్ 21న వీహెచ్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. అక్కడ దాదాపు 10 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన వీహెచ్.. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీహెచ్ భార్యకు కూడా కరోనా బారినపడగా..ఆమె కూడా విజయవంతంగా కరోనాను జయించారు.
    Published by:Sumanth Kanukula
    First published: