Home /News /telangana /

CONGRESS SENIOR LEADER V HANUMANTA RAO WELCOMES YASHWANT SINHA REVANTH REDDY STRONG WARNING TO HIM SK

Revanth Reddy: గోడకేసి కొడతాం.. ఎవరూ మొనగాళ్లు కాదు.. సొంత పార్టీ సీనియర్ నేతకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Hyderabad: ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. యశ్వంత్ సిన్హాను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన కూడా రాష్ట్రపతి అభ్యర్థికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు

ఇంకా చదవండి ...
    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ (Yashwant Sinha Hyderabad Tour) పర్యటన.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆయన్ను కలిసే విషయంలో నేతల మధ్య కాంగ్రెస్ అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. నేతల మధ్య కొట్లాటలు మళ్లీ మొదటికొచ్చాయి. యశ్వంత్ సిన్హా పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశించినా... సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumanta Rao) మాత్రం ఆయన మాటలను పక్కనబెట్టారు. స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. సీఎం కేసీఆర్‌ (CM KCR)తో కలిసి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. పార్టీ నిర్ణయాన్ని వీహెచ్ ధిక్కరించడం కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే నేతల తీరుపై టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ నిర్ణయాలకు ఎవరూ అతీతులు కాదని.. పిల్లలాటలు ఆడితే.. తీసి గోడకేసి కొడతామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

    తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1663 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు.. ఈ శాఖల్లో

    ''అర్థం పర్థం ఉండాలి. ముతి మతి తప్పి వ్యవహరిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవడైనా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే.. తీసి.. గోడకేసి కొడతాం. పిల్లలాట ఆడొద్దు. ఇది రాజకీయ పార్టీ. అధిష్టానంతో మాట్లాడి.. పార్టీ నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకుంది. దీనికి ఎవరూ అతీతులు కారు. ఎవ్వరూ మొనగాళ్లు కాదు.'' అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి.



    మరోవైపు వి.హనుమంతరావు కూడా రేవంత్ నిర్ణయాన్ని తప్పుబట్టుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాను సీఎల్పీకి ఆహ్వానించాల్సిందని అభిప్రాయపడ్డారు. అటు మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జాతీయ స్థాయిలో యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిచిందని.. అలాంటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు కలవకూడదని ఆయన అన్నారు. యశ్వంత్ సిన్హాను కలిసే విషయమై.. పార్టీ అధిష్టానంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో భట్టి తీరును తప్పుబట్టుతూ హైకమాండ్‌కు లేఖ రాస్తామని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.

    తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ రోజు నుంచి టీవీలో ఫ్రీగా పాఠాలు..


    కాగా, ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. యశ్వంత్ సిన్హాను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన కూడా రాష్ట్రపతి అభ్యర్థికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. సీఎం కేసీఆర్, వీహెచ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం విశేషం. టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆయన పర్యటన సందర్భంగా ఘనంగా ఏర్పాటు చేసి.. స్వాగతం పలికింది. కాంగ్రెస్ కూడా ఆయన్ను కలిస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని.. ఈ క్రమంలోనే యశ్వంత్ సిన్హా పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించింది. కానీ వీహెచ్ మాత్రం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Revanth Reddy, Telangana, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు