హోమ్ /వార్తలు /తెలంగాణ /

GHMC by elections 2021 : బీజేపీకి షాక్....లింగోజీగూడ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం

GHMC by elections 2021 : బీజేపీకి షాక్....లింగోజీగూడ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం

ఈ రెండు పార్టీలు హుజూరాబాద్‌లో మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం కొంత మేర పెరగుతుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్‌లో కలిసి నడిచేందుకు విపక్షాలు ముందుకు రావడం వల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ రెండు పార్టీలు హుజూరాబాద్‌లో మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం కొంత మేర పెరగుతుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్‌లో కలిసి నడిచేందుకు విపక్షాలు ముందుకు రావడం వల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు.

GHMC by elections 2021 : రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ డీలాపడిపోయినా..డివిజన్ స్థాయిలో మాత్రం తన జెండాను రెపరెపలాడించింది. అదికూడ గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు.

రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ డీలాపడిపోయినా..డివిజన్ స్థాయిలో మాత్రం తన జెండాను రెపరెపలాడించింది. అదికూడ గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లోని జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ విజయం సాధించింది. లింగోజీగూడ డివిజన్‌లో గత నెల ముప్పైన ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు పోటీలో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ నుండి రాజశేఖర్ రెడ్డి పోటిలో నిలబడగా బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించాడు. అయితే అక్కడ బీజేపీ విజ్ఝప్తి మేరకు టీఆర్ఎస్ అభ్యర్థిరి రంగంలోకి దింపలేదు. దీంతో ఇరు పార్టీల మధ్యే ప్రధాన పోటి ఉండడంతో చివరికి కాంగ్రెస్ డివిజన్‌ను కైవసం చేసుకుంది. కాగా గత డిశంబర్ లో జరిగిన ఎన్నికల్లో లింగోజీ గూడలో బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ గెలుపొందగా..ప్రమాణ స్వీకారం   చేయకముందే జనవరిలో మృత్యువాత పడ్డాడు. దీంతో ఉప ఎన్నికల అనివార్యమయింది.

ఇక బీజేపీ తన అభ్యర్థి ఏకగ్రీవ గెలుపు కోసం మంత్రి కేటీఆర్ ను కలిసి విజ్ఝప్తి చేసింది. దీంతో మంత్రి కేటీఆర్ సైతం అంగీకరించడంతో అక్కడ పోటీ ఉండదని భావించిన బీజేపీకి చుక్కెదురైంది. ఏకగ్రీవం కోసం బీజేపీ సభ్యులు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఝప్తి చేశారు. అయితే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పోటి చేసి తీరుతానని చెప్పడంతో బీజేపీ ప్రయత్నాలకు గండిపడింది. దీంతో మాట ప్రకారం టీఆర్ఎస్ పోటి   చేయకపోయినా...కాంగ్రెస్ అభ్యర్థిని పోటిలోకి దింపడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హస్తం ఉందనేది బీజేపీ నేతల ఆరోపణ ..దీంతో స్థానిక ప్రజలు సైతం గత ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని ప్రస్థుతం గెలిపించారు.

First published:

Tags: GHMC Election Result, Muncipal elections, Telangana