Vijayashanti: విజయశాంతిపై పూర్తిగా ఆశలు వదులుకున్న కాంగ్రెస్

Vijayashanti: విజయశాంతి మాత్రం కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

news18-telugu
Updated: November 21, 2020, 10:11 AM IST
Vijayashanti: విజయశాంతిపై పూర్తిగా ఆశలు వదులుకున్న కాంగ్రెస్
విజయశాంతి (ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న విజయశాంతి విషయంలో కాంగ్రెస్ పూర్తిగా ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ వైపు చూస్తున్న విజయశాంతిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం లోక్ సభ నియోజకవర్గాలవారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ ఆమెకు చోటు కల్పించింది. కాంగ్రెస్ మెదక్‌ లోక్‌సభ కమిటీకి దామోదర్‌ రాజనర్సింహ, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ సభ్యులుగా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్‌తో పాటు విజయశాంతికి కూడా స్థానం కల్పించారు.

అయితే విజయశాంతి మాత్రం కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక ఆమెపై నమ్మకం పెట్టుకోవడం వృధా అని కాంగ్రెస్ భావించినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ తరపున రూపొందించిన స్టార్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి చోటు కల్పించలేదు టీపీసీసీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజరుద్దీన్, వీ హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్, జెట్టి కుసుమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీను పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన కాంగ్రెస్.. ఈ జాబితాలో విజయశాంతికి మాత్రం ప్లేస్ ఇవ్వలేదు.

ఇక కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. సోషల్ మీడియా వేదికపై టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్న విజయశాంతి.. కాంగ్రెస్‌ను మద్దతుగా మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ను వీడతారని ప్రచారం జరుగుతోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగానే విజయశాంతి కాషాయ కండువా కప్పుకుంటారా లేక ఎన్నికలు పూర్తయిన తరువాత బీజేపీలో చేరతారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ బీజేేపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సైతం హస్తానికి హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: November 21, 2020, 10:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading