ప్రధాని మోదీ ముందుకు తెలంగాణ ఆర్టీసీ పంచాయితీ

ఆర్టీసీలో కేంద్రం వాటా 33శాతం ఉందని.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను విధుల్లోకి తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.

news18-telugu
Updated: November 28, 2019, 3:22 PM IST
ప్రధాని మోదీ ముందుకు తెలంగాణ ఆర్టీసీ పంచాయితీ
మోదీ, తెలంగాణ ఆర్టీసీ
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ పంచాయతీ ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరింది. ఆర్టీసీ అంశంపై పీఎంవో కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు వినతీ పత్రం ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ఉద్యోగాలు పోయావన్న మనస్థాపంతో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 33శాతం ఉందని.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను విధుల్లోకి తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.

తెలంగాణ ఆర్టీసీ భవితవ్యం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టుల్లో ప్రస్తుతానికి కేసులు ముగిసినా.. విధుల్లో చేరతామని కార్మికులు చెప్పినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం కేసీఆర్.First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>