CONGRESS MP REVANTH REDDY COMMENTS ON BJP AND MIM DEMAND BHARATHRATNA FOR PV AND NTR MS
GHMC Elections: వారి పేర్లను వాడుకోవడం దుర్మార్గం.. ఆ రెండు పార్టీలపై రేవంత్ రెడ్డి ఫైర్
ప్రస్తుతం బీజేపీలో ఉన్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రా శేఖర్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో నేత గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం అత్యంత దుర్మార్గమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ, ఎంఐఎం లు వారి పేర్లను వాడుకుని ఓట్ల రాజకీయం చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
దేశంలో ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా.. బీజేపీ, ఎంఐఎం లు వారి పేర్లను వాడుకుని ఓట్ల రాజకీయం చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు బీజేపీ, ఎంఐఎం లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ.. దానికి శత్రుత్వంగా భావించే ఇతర పార్టీల నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని.. కానీ ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న బీజేపీ కురవృద్ధుడు ఎల్ కె అద్వాణీ, మురళీ మనోహర్ జోషీ, తదితర నాయకులకు తగిన గౌరవం ఇవ్వలేకపోయిందని రేవంత్ విమర్శించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి బీజేపీ, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. పీవీ నరసింహరావు.. ఎన్టీఆర్‌లపై బీజేపీకి ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు దివంగత నాయకులపై ఆ పార్టీకి ప్రేమ లేదని.. కేవలం ఎన్నికల కోసమే వారిని రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. ఈనెల 29న నగరానికి వస్తున్న బీజేపీ అగ్రనాయకులు.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ఈ ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం ఎంఐఎం పార్టీ అగ్రనేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలుస్తామని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనికి బదులుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. ఎంఐఎం అలా చేస్తే రెండే నిమిషాల్లో ధారుసలాంను కూల్చేస్తామని... అందుకు బీజేపీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. కాగా, ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సీరియస్ అయ్యారు. పీవీ, ఎన్టీఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.