హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy: సీఎం కేసీఆర్ బిహార్​ పర్యటనపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?

Komatireddy: సీఎం కేసీఆర్ బిహార్​ పర్యటనపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?

కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్​కి వెళ్లి అక్కడ అమరుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంకే బహిరంగ లేఖ రాశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చైనా జవాన్లతో జరిగిన పోరాటంలో గల్వాన్ లోయలో అమరులైన బిహర్ (Bihar)సైనికుల కుటుంబాలకు సాయం అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) బిహార్​లో పర్యటించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి గల్వాన్‌ లోయలో మరణించిన ఐదుగురు బిహర్ (Bihar)సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు తదితర జాతీయ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రుల నడుమ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati reddy Venkat Reddy)బహిరంగ లేఖ రాశారు.ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళల కుటుంబాలను పరామర్శించే తీరిక లేదు. కానీ బిహార్ రాష్ట్రం పాట్నాకు వెళ్లి రాజకీయాలు చేసే టైం ఉందా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పేదల ప్రాణాల కంటే ముఖ్యమంత్రికి రాజకీయాలే ముఖ్యమా అని నిలదీశారు. పేద కుటుంబాలను పరామర్శించకుండా.. రాజకీయాల కోసం పట్నా వెళ్లడాన్ని కేసీఆర్ ఏ విధంగా సమర్దించుకుంటారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం తో పాటు వారి పిల్లలకు పూర్తి విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.


అనవసర ప్రచారం చేస్తున్నారని..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన మిగతా 30మంది మహిళలకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటిరెడ్డి డిమాండ్​ చేశారు. పేదలు ఎక్కువ ఉండే ఇబ్రహీంపట్నం లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే వాటిని ఆపి సివిల్ సర్జన్లను నియమించాలని కోమటిరెడ్డి డిమాండ్​ చేశారు. అందుబాటులో వైద్యులు ఉంటే ఇంత ఘోరం జరగకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందన..
ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో ఒక గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని అన్నారు. వాళ్లంతా నిరుపేదలేనని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని రేవంత్ ఆరోపించారు. అల్లుడు హరీశ్ సమర్ధుడని కేసీఆర్ ఆరోగ్య మంత్రిని చేశారని.. కానీ ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదని.. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: CM KCR, Komatireddy venkat reddy