ఎంపీ కోమటిరెడ్డి అరెస్ట్...భువనగిరిలో ఉద్రిక్తత

ర్నాకు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

news18-telugu
Updated: August 30, 2019, 3:36 PM IST
ఎంపీ కోమటిరెడ్డి అరెస్ట్...భువనగిరిలో ఉద్రిక్తత
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 30, 2019, 3:36 PM IST
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో ఆందోళనకు దిగారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో ఆయన రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి జెడ్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ధర్నాకు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కోమటిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత మధ్య కోమటిరెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...