Home /News /telangana /

CONGRESS MP KOMATIREDDY URGES PM MODI TO TAKE ACTION ON CM KCR OVER ALLEGGED SINGARENI SCAM OF RS 50000CRORE MKS

CM KCRకు ఉచ్చు బిగిస్తున్నారా? కేంద్రానికి ఫిర్యాదులు.. ఒక్క సింగరేణిలోనే రూ.50వేల కోట్ల స్కామ్.. మోదీతో కోమటిరెడ్డి

ప్రధాని మోదీకి ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు

ప్రధాని మోదీకి ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు

ఈ వ్యవహారంపై తప్పకుండా చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారని, ఏయే రంగాల్లో అవినీతి జరుగుతోందో ప్రధాని అడిగి తెలుసుకున్నారని, తెలంగాణపై దృష్టి పెడతామని చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తోన్న విపక్ష కాంగ్రెస్, బీజేపీలు సంబంధిత ఆధారాలతో మోదీ సర్కారుకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి. ఒక్క సింగరేణి సంస్థలోనే రూ.50వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ విషయాన్ని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై న్యాయపరమైన చర్యలు కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇదివరకే కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. వీటన్నటిపై కేంద్రం దృష్టిసారించిందని, గులాబీ అక్రమాలు నిగ్గుతేలేరోజు దగ్గర్లోనే ఉందని విపక్ష నేతలు అంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్ కు ఉచ్చు బిగించేలానే లక్ష్యంతోనే కమలం, కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై విపక్షాల ఆరోపణలు కొత్తేమీ కాకున్నా, ఇటీవల తెలంగాణ అంశాలకు సంబంధించి కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం పార్లమెంటు భవనంలో ప్రధానిని ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మోదీతో చర్చల సారాంశాన్ని కోమటిరెడ్డి వివరించారు..

Petrol Diesel: పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. అక్కడ 50శాతం పెంపు.. Ukraine Warతో ఇలా


సింగరేణిలో రూ.50 వేల కోట్ల అవినీతి జరగబోతోందని, కోల్‌ ఇండియా మార్గదర్శకాలను పక్కనబెట్టి సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మైనింగ్‌ టెండర్‌ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ప్రధానికి చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై తప్పకుండా చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారని కాంగ్రెస్ ఎంపీ చెప్పారు. ఇదేకాకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా ప్రధానికి వివరించానని, ఏయే రంగాల్లో అవినీతి జరుగుతోందో ప్రధాని అడిగి తెలుసుకున్నారని, తెలంగాణపై దృష్టి పెడతామని చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు.

Cabinet Reshuffle: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం! -ఏపీ ఆర్థిక మంత్రిగా విజయసాయిరెడ్డి?


సీఎం కేసీఆర్ పై ఫిర్యాదులతోపాటు తెలంగాణలో అభివృద్ధి పనులపైనా ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి కీలక వినతులు చేశారు. నమామీ గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరానన్నారు. హైదరాబాద్‌-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణంపై కూడా ప్రధానితో చర్చించానని, జీఎంఆర్‌ సంస్థ రహదారి నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్‌కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. ఈ రహదారి అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించనున్నట్లు చెప్పారు. కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి-మోత్కూరు రోడ్డును, నల్లగొండ-మల్లేపల్లి, భువనగిరి- చిట్యాల రోడ్లను జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరానన్నారు. తన విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మరోవైపు,

Kerala: 8 నెలల గర్బవతి.. పుట్టబోయే బిడ్డ గురించి ఒక్కటే చింత.. బతిమాలినా వాడు వినలే.. చివరికి..


తెలంగాణ అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు తుది తీర్పు చెప్పింది. సభలో నిర్ణయాధికారం స్పీకర్‌దే అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి సస్పెన్షన్ ఎత్తివేతను కోరనున్నారు. కాగా, తమ సస్పెన్షన్.. ప్రభుత్వం, స్పీకర్ కుట్రేనని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గులాబీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విభజన సమయంలో సోమేశ్ ను ఏపీకి కేటాయించారని, నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ తోపాటు మరో 12 మంది అధికారులు తెలంగాణలో కొనసాగుతున్నారని, దీనిపై భారత ప్రభుత్వం 2017లోనే రిట్ పిటిషన్ వేసిందని, నాటి పిటిషన్ ను విచారించి, సోమేశ్ పై చర్యలకు ఆదేశించాలంటూ సీజేఐ రమణకు రఘునందన్ రావు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో కేంద్రం తాజా స్టాండ్ వెల్లడికావాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Congress, Komatireddy venkat reddy, Pm modi, Singareni Collieries Company, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు