కేంద్రబడ్జెట్ ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ రాజ్యంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈక్రమంలోనే ఆయన వ్యాఖ్యలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తుండగా రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలు పలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఏకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేయడంతో పాటు మండల కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది.
దీంతో పాటు ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ పై మరిన్ని విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. సీఎం వెంటనే దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి దళితులను కెసిఆర్ మోసం చేస్తూ, ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటూ కొత్త కుట్రకు తెర తీశారు.కెసిఆర్ నియంతృత్వ పోకడలకు రాజ్యాంగం అడ్డుగా ఉందని అక్కసుతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.. అయితే... కెసిఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఎంతోమంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగం రూపొందించారని.
Khammam : ఆ మాజీ మంత్రికి బుజ్జగింపులు.. తెరాస అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటో..?
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులు కమిషన్లు పెంచుకునేందుకు రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటున్నారా..? అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆయన ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కెసిఆర్ మర్చిపోయారని చెప్పారు. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలో దేశ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కాగా ఈ వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడని అన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ స్థాయిలో రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ కేవలం ధర్నాలు, దీక్షలకు పరిమితమవుతున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు...
Murder : పెళ్లింట విషాదం... పెళ్లి కోసం వచ్చిన మేనమామపై గొడ్డలితో దాడి చేసి చంపిన తండ్రి...
ఇక రాష్ట్ర విభజన హామీలపై ఏనాడైనా కేసీఆర్ మోడీ గారిని కలిశారా అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీలు ప్లాంట్, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,తోపాటు పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదాలాంటీ హామిలు ఇచ్చిందని గుర్తు చేశారు. కాని వాటిలో ఒక్కటి కూడా బీజేపీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర అవసరాలను సాధించడంలో విఫలమయ్యారని అన్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు సైతం రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. రైల్వే బడ్జెట్‌లో సైతం తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, అయినా టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపలేదని ,దీంతో వారికి తెలంగాణ అభివృద్దిపై ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jeevan reddy, Telangana